న్యూఢిల్లీ: షారుఖ్ వంటి అగ్రహీరో ఆటోగ్రాఫ్ సంపాదించుకోవడమే చాలా కష్టం. అలాంటిది ఆయనతో కలసి నటించే చాన్సే వస్తే.. చాలా బాగుంటుంది కదూ! ఆన్‌లైన్ షాపింగ్ సైట్ గ్రూపాన్ ఎస్‌ఆర్‌కే అభిమానులకు ఆయనతోపాటు తెరపై కనిపించే అవకాశం ఇస్తానంటోంది. ‘చాలా కాలంగా దీని గురించి ఆలోచిస్తున్నాం. ఇందుకోసం చాలా మంది ఔత్సాహిక నటులు, సీనియర్లతోనూ మాట్లాడాం. ఈ ఆలోచన బాగానే ఉన్నా, నటుల ఎంపిక కోసం దూర ప్రాంతాలకు వెళ్లి ఆడిషన్లు నిర్వహించడం చాలా కష్టం. చాలా నగరాల్లో తిరగాల్సి ఉంటుంది. ఈ పద్ధతిని పక్కనబెట్టి దరఖాస్తుదారులు వెబ్‌కామ్ ద్వారానే ఆడిషన్ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెడుతున్నాం’ అని గ్రూపాన్ సీఈఓ అంకుర్ వారికూ అన్నారు. onewayticket.in అనే సైట్‌కు వెళ్లి సులువుగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
ప్రముఖ నటులతో కూడిన జడ్జిల బృందం 200 మందిని ఎంపిక చేస్తుంది. వీరందరినీ ముంబైకి రప్పించి ఆడిషన్లు నిర్వహిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి రూ.499 చెల్లించాలి. షారుఖ్ అగ్రనటుడు కాబట్టి తమ కంపెనీ ఆహ్వానానికి మంచి స్పందన ఉంటుందని గ్రూపాన్ విశ్వసిస్తోంది. ‘నేను వ్యక్తిగతంగానూ షారుఖ్‌కు అభిమానిని. ఈ కార్యక్రమం కోసం మా కంపెనీ షారుఖ్ బ్యానర్ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఒప్పందం కుదుర్చుకుంది’ అని వారికూ వివరించారు. అంతర్జాతీయంగానూ షారుఖ్‌కు పేరుంది కాబట్టి విదేశాల్లోని షారుఖ్ అభిమానులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. మలేసియా, ఆస్ట్రేలియా, సింగపూర్, ఇండోనేసియా, న్యూజిలాండ్, దుబాయ్‌వాసులు వన్‌వేటికెట్.ఇన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని గ్రూపాన్ కంపెనీ తెలిపింది.
షారుఖ్‌తో నటిస్తారా ?
Published Sat, Apr 19 2014 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 6:15 AM
Advertisement
Advertisement