గుంటూరు జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది.
హైదరాబాద్: గైనకాలజీ పీజీ విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసులో నిందితురాలిగా ఉన్న గుంటూరు జీజీహెచ్ ప్రొఫెసర్ లక్ష్మిని ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. సంధ్యారాణి ఆత్మహత్య కేసును శుక్రవారం ఉన్నత న్యాయస్థానం విచారించింది. నిందితురాలు ప్రొఫెసర్ లక్ష్మి పరారీలో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది... హైకోర్టుకు తెలిపారు.
ఈ కేసుపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మూడు వారాలు గడువు ఇవ్వాలని కోర్టును ప్రభుత్వం తరపు లాయర్ కోరారు. తదుపరి విచారణను న్యాయస్థానం రెండు వారాలు వాయిదా వేసింది. కాగా, తనపై కేసును కొట్టేయాలని ప్రొఫెసర్ లక్ష్మి గురువారం హైకోర్టును ఆశ్రయించారు.