సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలో నియమావళిని ఉల్లంఘించి నిర్మించిన కట్టడాల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్‌న ు జారీ చేయాలనుకున్న ప్రభుత్వం, తదనంతర పరిస్థితులపై ఇప్పుడు పునరాలోచన లో పడింది. ఆ ఆర్డినెన్స్‌ను యథాతథంగా కాకుండా కొన్ని సవరణలతో తీసుకు రావాలని యోచిస్తోంది.
ఇప్పుడున్న విధంగానే అమలు చేస్తే పలు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయ నిపుణులు ప్రభుత్వానికి సూచించారు. దీనిని ముందు పెట్టుకుని నివాసుల సంఘాల సమాఖ్యలు లేదా వ్యక్తులు కోర్టును ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. కనుక ప్రస్తుతం ఉన్నదున్నట్లుగా ఆర్డినెన్స్ తీసుకు రావద్దని న్యాయ నిపుణులు సూచించినట్లు సమాచారం. దీనికి బదులు ప్రయోగాత్మకంగా వార్డు లేదా జోన్ పరిధిలో అక్రమ-సక్రమ చేపట్టాలని సలహా ఇచ్చారు. తద్వారా మున్ముందు ఎదురయ్యే సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చని సూచించారు. దీనికి తోడు వ చ్చే నెలలో బెల్గాంలో శాసన సభ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఆ సమావేశాల్లో ముసాయిదా బిల్లును ప్రవేశ పెట్టి చర్చించాలని, తర్వాతే అక్రమ-సక్రమను అమలు చేయాలని కూడా న్యాయ నిపుణులు సూచించారు.
అనుకూలాంశాలు
అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ వల్ల నగరంలోని లక్షల మంది గృహాల యజమానులకు ఊరట కలుగుతుంది. తద్వారా లభించే కోట్ల రూపాయల ఆదాయంతో నగరంలో అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు ప్రాథమిక సదుపాయాల కల్పనకు వీలేర్పడుతుంది.
ప్రతికూలాంశాలు
ఆర్డినెన్స్ ద్వారా నియమావళి ఉల్లంఘనను అడ్డుకోవడం సాధ్యమవుతుందని అనుకోవడానికి వీల్లేదు. తమను వంచించిన ఫ్లాట్ యజమానులకు కేవలం జరిమానా విధించడం ద్వారా అంతా సర్దుబాటు చేయడానికి వీలేర్పడుతుంది. కనుక ఈ ప్రతిపాదిత ఆర్డినెన్స్‌ను చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.
అక్రమ-సక్రమ ఆర్డినెన్స్‌పై పునరాలోచన
Published Mon, Oct 28 2013 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
Advertisement