రాష్ట్ర కాంగ్రెస్‌లో రాహుల్ ముద్ర
Published Sun, Dec 22 2013 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
చెన్నై, సాక్షి ప్రతినిధి : పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్ర కాంగ్రెస్‌పై రాహుల్‌గాంధీ ముద్ర ఏనాడో పడిపోగా ఎన్నికల నేపథ్యంలో మరో వ్యూహానికి సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఆకర్షణీయమైన నేతల ఎంపికను ప్రారంభించారు.పేరుకు జాతీయపార్టీగా చెలామణి అవుతున్నా రాష్ట్రంలో కాం గ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ కంటే బలహీనంగా మారిపోయింది. ఒంటరిగా గెలిచే స్తోమతను కోల్పోయిన కాంగ్రెస్ కొన్ని దశాబ్దాల క్రితమే ప్రభుత్వ ఏర్పాటుకు దూరమైంది. ఐదేళ్ల కొకసారి ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకుంటూ కాంగ్రెస్ కాలక్షేపం చేస్తోంది. రాష్ట్రంలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మెజార్టీ స్థానాలు దక్కిం చుకోకున్నా కేంద్రంలో అధికారంలోకి రావడంతో తమిళనాడుకు చెందిన నేతలు కేబినెట్‌లో మంత్రులుగా మారిపోయారు.
గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేవ లం 8 స్థానాల్లో గెలుపొందినా నలుగురు కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొందారు. కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్న డీఎంకే 18 ఎంపీల స్థానాల్లో గెలుపొందగా 9మంది కేంద్ర మంత్రు లు కాగలిగారు. కాంగ్రెస్ నుంచి ఎంత మంది కేంద్ర మంత్రులైనా పార్టీకి అదనంగా వచ్చిన బలమేమీ లేదు. కేంద్ర మంతులు చిదంబరం, జీకేవాసన్, జయంతి నటరాజన్, సుదర్శన్ నాచియప్పన్‌ది తలోదారి. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన తరువాత ముఠా తగాదాలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్‌కు శస్త్ర చికిత్స చేయడం ప్రారంభించారు. ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో పార్టీ ఘోరపరాజయం పాలవడం కాంగ్రెస్‌ను కుదిపేసిం ది.
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఇదే ఫలితాలు పునరావృతం కాకూడదనే భావనతో రాష్ట్ర రాజకీయాల పై మరోసారి దృష్టిపెట్టారు. ఇందు కు కొనసాగింపుగా తమిళనాడుకు చెందిన కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జయంతి నటరాజన్ మాజీగా మారిపోయారు. రాష్ట్రం లో సీనియర్ నేత, మంచి వాగ్దాటికలిగన నాయకురాలిగా పేరొందిన ఆమె సేవలను ప్రచారానికి విని యోగించుకోనున్నారు. వర్గ వైషమ్యాలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర కాంగ్రెస్ నుంచి జయంతి నటరాజన్ చేత రాజీనామా చేయిం చిన అధిష్టానం ఆ తరువాత ఎవరిపై కన్నువేస్తుందోననే అంశం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
Advertisement
Advertisement