వన్యప్రాణుల అవయవాల అక్రమ వర్తకాన్ని సహించబోమని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ హెచ్చరించారు. స్థానిక జంతుప్రదర్శనశాలలో ఆదివారం ఉదయం
న్యూఢిల్లీ: వన్యప్రాణుల అవయవాల అక్రమ వర్తకాన్ని సహించబోమని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ హెచ్చరించారు. స్థానిక జంతుప్రదర్శనశాలలో ఆదివారం ఉదయం గతంలో స్వాధీనం చేసుకున్న వన్యప్రాణుల అవయవాలను దహనం చేశారు. ఇదే సమయంలో జూకి వచ్చిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడుతూ ఇలా స్వాధీనం చేసుకున్న ఉత్పత్తుల విక్రయం ద్వారా వచ్చిన సొమ్మును ఉగ్రవాద కార్యకలాపాలు, నేరాల నిరోధానికి వినియోగిస్తున్న విషయం నిజమేనని అంగీకరించారు. అయితే ఇకమీదట వన్యప్రాణుల సంరక్షణ కోసం వినియోగిస్తామన్నారు. వన్యప్రాణుల అవయవాల వర్తకంపై నిషేధం అమల్లో ఉందని, అటువంటి కార్యకలాపాలను సహించబోమనే సందేశాన్ని పంపాలనే ఉద్దేశంతోనే వాటిని ఇప్పుడు దహనం చేశామన్నారు. వన్యప్రాణుల చర్మం, కొమ్ములు, దంతాలకు మార్కెట్లో మంచి ధర పలుకుతుందన్నారు.