తనపై ఎస్సై చేయి చేసుకున్నాడన్న అవమానంతో ఆ ఎస్సై ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడో రైతు.
బళ్లారి రూరల్(కర్ణాటక): అందరి ముందు తనపై ఎస్సై చేయి చేసుకున్నాడన్న అవమానంతో ఆ ఎస్సై ఇంటి ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడో రైతు. ఈ ఘటన స్థానిక కొళగల్లులో ఆదివారం ఉదయం జరిగింది. కొళగల్లుకు చెందిన హనుమప్ప(40) తన పొలంలో కాలువ పక్కన బావి తవ్వుకున్నాడు. దీని వల్ల కాలువ నీళ్లు మిగతా పొలాలకు అందడం లేదని అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో తహసీల్దార్ వచ్చి రైతులందరినీ సమావేశపరచి మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని సూచించారు.
శనివారం సాయంత్రం ఈ పంచాయితీ జరుగుతున్నప్పుడు హనుమప్పపై బళ్లారి రూరల్ ఎస్సై చేయి చేసుకొన్నాడు. ఎస్సై అందరి ముందు తనను కొట్టాడన్న అవమానంతో హనుమప్ప ఆదివారం ఎస్సై వసంతకుమార్ ఇంటి ముందుకు వెళ్లి పురుగుల మందు తాగి అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు చికిత్స నిమిత్తం విమ్స్‌కు తరలించారు.