అవి నా వ్యక్తిగతం | love My Personal Nitya Menon | Sakshi
Sakshi News home page

అవి నా వ్యక్తిగతం

Published Tue, Jul 1 2014 11:39 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

అవి నా వ్యక్తిగతం - Sakshi

అవి నా వ్యక్తిగతం

 ప్రేమ, పెళ్లి అనేవి నా వ్యక్తిగత విషయాలని ఈ అంశాల గురించి బహిరంగంగా వెల్లడించడం జరగదని అంటున్నారు నిత్యామీనన్. నటిగా మంచి పేరు తెచ్చుకున్న ఈ మలయాళ ముద్దుగుమ్మకు పొగరుబోతు అనే పేరు కూడా ఉంది. అలాంటి అహంకారపు చర్యలతోనే కొంత కాలం మలయాళ చిత్ర పరిశ్రమ నిత్యామీనన్‌ను బ్యాన్ చేసింది. ప్రస్తుతం మళ్లీ మాతృ భాషలో నటించడం మొదలెట్టిన ఈ అమ్మడు తాజాగా పాడటంపై మోహం పెంచుకున్నారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై నిత్యా మీనన్ స్పందిస్తూ ప్రస్తుతం పలువురు హీరోయిన్లు పాడటంపై దృష్టి సారిస్తున్నారని గుర్తుచేశారు.
 
 అలాంటి వారిలో తానూ ఉన్నానని చెప్పారు. అయితే దీన్ని తాను వృత్తిగా స్వీకరించలేదని స్పష్టం చేశారు. అభిమానులు తాను పాడాలని కోరుకుంటున్నారని చెప్పారు. అయితే ఆసక్తి ఎలా ఉన్నా దర్శక నిర్మాతలు కావాలనుకుంటేనే పాడతానన్నారు. తనకు ఎవరితోనూ అధికంగా బాతాఖానీ కొట్టడం ఇష్టం ఉండదని అదే విధంగా వృత్తిపరమయిన అనుభవం ఉన్నవారితోనే నటిస్తానని అన్నారు. సహ నటీనటులతో మంచి అండర్ స్టాండింగ్ ఉంటేనే సన్నివేశం పండుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాలీవుడ్ ప్రవేశం ఆలోచన ఉందా? అని అడుగుతున్నారని అయితే హిందీ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి తనకు లేదని చెప్పారు.
 
 మరీ మంచి పాత్ర అని తన మనసుకు అనిపించే పాత్ర వస్తే బాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశానికి రెడీ అవుతానన్నారు. అయితే ఇదంతా జరుగుతుందా అన్నది తెలియదని అన్నారు. అలాగే ఎవరినయినా ప్రేమించారా? పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారని ఆమె గుర్తుచేశారు. ప్రేమ, పెళ్లి అనేవి తన వ్యక్తిగత విషయాలన్నారు. వాటి గురించి బహిరంగ పరచాల్సిన అవసరం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ అంశాలు తన మనసుకు సంబంధించినవని నిత్యామీనన్ అంటున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement