భారీగా దొరికిన పెద్దనోట్లు, చిక్కుల్లో మంత్రి | Maharashtra BJP Minister admits seized cash is his | Sakshi
Sakshi News home page

భారీగా దొరికిన పెద్దనోట్లు, చిక్కుల్లో మంత్రి

Published Fri, Nov 18 2016 4:16 PM | Last Updated on Thu, Mar 28 2019 8:41 PM

భారీగా దొరికిన పెద్దనోట్లు, చిక్కుల్లో మంత్రి - Sakshi

భారీగా దొరికిన పెద్దనోట్లు, చిక్కుల్లో మంత్రి

ముంబై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేశాక ఆ పార్టీకే చెందిన ఓ మంత్రి ఇరకాటంలో పడ్డారు. 91 లక్షలా 50 వేల రూపాయల విలువైన 500, 1000 రూపాయల నోట్లను మహారాష్ట్ర పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు దొరికిన ఈ నగదు తనదేనని ఆ రాష్ట్ర సహకార శాఖ మంత్రి సుభాష్‌ దేశ్‌ముఖ్‌ చెప్పారు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా ఈ డబ్బు తన వద్ద ఉంచుకున్నట్టు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న అకస్మాత్తుగా పెద్ద నోట్లను రద్దు చేశారన్నారు. తాను ఈ డబ్బును అక్రమంగా దాచుకోలేదని, ఎలాంటి విచారణకైనా సిద్ధమని మంత్రి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement