
సిగ్గుచేటు.. మద్యం లేకుంటే ఏపీ ప్రభుత్వం నడవదా?
విజయవాడ: మద్యం అమ్మకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యపు ప్రకటనపై ప్రముఖ సామాజిక వేత్త, రచయిత మేథాపాట్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అమ్మకపోతే, స్కూళ్లు పథకాలు నడపలేమని ప్రభుత్వాలు అనడం సిగ్గు చేటని మేథాపాట్కర్ మండిపడ్డారు. మద్యం లేని సమాజం కావాలని ఆమె డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే ముందుకెళితే ఏర్పడేది స్వచ్ఛ భారత్ కాదని, మద్యంతో నిండిన అస్వచ్ఛ భారత్ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. నాటి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్యపానాన్ని నిషేధిస్తే నేటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం మద్యం అమ్మకాలను తెగ ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం వల్ల రాష్ట్రంలో భయంకరపరిస్థితులు ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంపై నిషేధం విధించాలని ఆమె డిమాండ్ చేశారు.