భారీగా మిర్చి విత్తనాలు స్వాధీనం
Published Sat, Nov 26 2016 3:54 PM | Last Updated on Mon, Sep 4 2017 9:12 PM
కొణిజెర్ల: ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలంలో విజిలెన్స్ అధికారులు భారీగా మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పల్లిపాడులోని స్వర్ణభారతి కోల్డ్ స్టోరేజిపై శనివారం మధ్యాహ్నం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 1.40 లక్షల బస్తాల మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిల్వలను సీజ్ చేసి, నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.
Advertisement
Advertisement