
జూబ్లీహిల్స్ భవనం విలువ రూ. 3 కోట్లేనా?
హైదరాబాద్ నగరంలోనే అత్యంత ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్‌లో ఉన్న భవనం విలువ కేవలం రూ. 3 కోట్లేనా అని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మిథున్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ అంశంపై చిత్తూరులో మాట్లాడారు.
అవినీతికి మూలమైన పెదబాబు, చినబాబుల ఆస్తులు అంతేనా అని మిథున్ రెడ్డి ప్రశ్నించారు. మీరు ప్రకటించిన ఆస్తులకు 50 శాతం అదనంగా ఇస్తామని.. ఆ డబ్బును మీరు మోసం చేసిన డ్వాక్రా మహిళలకు పంచగలరా అని ఆయన సవాలు చేశారు.