తగ్గిన అనిత | MLA Anitha R. Radhakrishnan Meets DMK Chief Karunanidhi | Sakshi
Sakshi News home page

తగ్గిన అనిత

Published Fri, Nov 27 2015 1:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

తగ్గిన అనిత

తగ్గిన అనిత

- కరుణతో భేటీ
 - శ్రమిస్తానని హామీ

 సాక్షి, చెన్నై: డీఎంకే తూత్తుకుడి జిల్లా నేత అనితా ఆర్ రాధాకృష్ణన్ పట్టువీ డారు. జిల్లా కార్యదర్శి పెరియస్వామి తో కలిసి పార్టీ కోసం శ్రమించేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు గురువా రం అధినేత కరుణానిధి, దళపతి స్టాలి న్‌ను కలిశారు.
 
 తూత్తుకుడి జిల్లాలో తన కంటూ వ్యక్తిగత బలం కల్గిన నేత అనితా రాధాకృష్ణన్. తొలుత అన్నాడీఎంకేలో ఆ జిల్లా నేతగా, మాజీ మంత్రిగా చక్రం తిప్పిన ఘనత ఆయనది. అన్నాడీఎంకేలో ఏర్ప డ్డ విభేదాలతో డీఎంకేలోకి వచ్చారు.  అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక మనసు మార్చుకునే యత్నం చేశారు. డీఎంకే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాకైనా, తన మనసు అంతా అన్నాడీఎంకే చుట్టూ తిరుగుతున్నట్టు ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. సీఎం జయలలిత సమక్షంలో ఆ పార్టీలో చేరడానికి తీవ్రంగానే ప్రయత్నించినా, తలుపులు మాత్రం తెరచుకోలేదు.
 
  ఎట్టకేలకు తీవ్ర ప్రయత్నంతో ఓమారు కలిసే అవకాశం వచ్చినా, పార్టీలోకి  ఆహ్వానం మాత్రం దక్కలేదు. దీంతో డీఎంకేలో ఉంటూనే, అన్నాడీఎంకేకు విధేయత చాటుకునే రీతిలో వ్యవహరించడం మొదలెట్టారు. దీన్ని గుర్తించిన కరుణానిధి అనితా రాధాకృష్ణన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సిద్ధం కావాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే అన్న బో ర్డును మాత్రం తగిలించుకుని రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండడం మొదలెట్టారు. అదే సమయంలో తూత్తుకుడి డీఎంకే జిల్లా పగ్గాలు మరో మంత్రి పెరియస్వామి చేతికి చేరాయి. దీంతో రాజకీయాలకు ఇక అనిత దూరం అన్నప్రచారం ఆ జిల్లాలో బయల్దేరింది.
 
 తగ్గిన అనిత: డీఎంకేలో తనకు ఇక గుర్తింపు లేదన్న నిర్ణయానికి అనిత ఆర్ రాధాకృష్ణన్ వచ్చేశారని చెప్పవచ్చు. పార్టీకి, ప్రజలకు దూరంగా ఉండడం మొదలెట్టిన ఆయనకు అన్నాడీఎంకే నుంచి చివరి క్షణం వరకు ఆహ్వానం, పిలుపు మాత్రం రాలేదు. దీంతో వెనక్కు తగ్గారు. మనసు మార్చుకుని తనను సంక్లిష్ట పరిస్థితుల్లో అక్కున చేర్చుకుని ఎమ్మెల్యేగా నిలబెట్టిన కరుణానిధి పక్షానే ఉండడం మంచిదన్న భావనకు వచ్చేసినట్టున్నారు. దీంతో ఉదయాన్నే చెన్నైలోని గోపాలపురం మెట్లు ఎక్కేశారు. అధినేత ఎం కరుణానిధి, దళపతి స్టాలిన్‌లను కలుసుకున్నారు. జిల్లా కార్యదర్శి పెరియస్వామితో కలిసి, తానూ పార్టీ కోసం జిల్లాలో సేవల్ని అందిస్తానని కరుణానిధికి హామీ ఇచ్చి బయటకు వచ్చేశారు. వెలుపల మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నల్ని సంధించగా, గడిచిన కా లం చీకటి రోజులుగా పేర్కొంటూ స మాధానాలు దాట వేశారు. ఇక తన కర్తవ్యం పెరియస్వామితో కలసి పార్టీని జి ల్లాలో బలపేతం చేయడమేనని స్ప ష్టం చేసి ముందుకు సాగారు.
 
 మద్దతు ప్లీజ్ : కరుణానిధితో అనితా భేటీ అనంతరం జానపద కళాకారుడు కోవన్‌తో కలిసి మక్కల్ కలై ఇయక్కం వర్గాలు గోపాలపురానికి రావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల సీఎం జయలలితకు వ్యతిరేకంగా వివాదాస్పద పాటలను పాడి కోవన్ జైలుకు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే. కరుణానిధితో భేటీ అనంతరం బయటకు వచ్చిన కోవన్ మీడియాతోమాట్లాడుతూ డిసెంబర్‌లో మద్యానికి వ్యతిరేకంగా తాము చేపట్ట దలచిన మహానాడుకు మద్దతు ఇవ్వాలని కరుణానిధిని విజ్ఞప్తి చేశామన్నారు. అన్నాడీఎంకే, బీజేపీ మినహా తక్కిన అన్నిపార్టీల నాయకుల్ని కలిసి మద్దతు కోరనున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement