ఖేర్వాడీ ఫ్లైఓవర్ రెడీ | MMRDA sets itself May 31 deadline for south-bound side of Kherwadi flyover | Sakshi
Sakshi News home page

ఖేర్వాడీ ఫ్లైఓవర్ రెడీ

Published Wed, May 14 2014 10:35 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 AM

MMRDA sets itself May 31 deadline for south-bound side of Kherwadi flyover

సాక్షి, ముంబై: పశ్చిమ శివారు ప్రాంతాల నుంచి నగరానికి వచ్చేవారికి ఓ శుభవార్త. ఖేర్వాడీ దక్షిణ భాగ ఫ్లైఓవర్‌ను వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే వెస్టర్న్ ఎక్స్‌ప్రెస్‌హైవేపై  రద్దీ వేళల్లో ట్రాఫిక్ సమస్య నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుందంటూ సంబంధిత అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

 అయితే ఈ ఫ్లై ఓవర్ ఉత్తర భాగ  నిర్మాణ పనుల పూర్తికి మరో ఏడాది కాలం పట్టే అవకాశముందని ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎమ్మెమ్మార్డీయే) అధికారులు వెల్లడించారు. దీంతో మరో ఏడాదిపాటు సాయంత్రం రద్దీ సమయంలో ఈ మార్గంలో ప్రయాణించే నగర వాసులు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోక తప్పదని వారు పేర్కొన్నారు. ఈ పనులను ఎమ్మెమ్మార్డీఏ రెండు విడతలుగా చేపట్టింది. ఈ నెల 31వ తేదీని దీనికి తుది గడువుగా నిర్ణయించారు. ఈ విషయమై పనుల పూర్తికి మరో వారం అదనంగా పడుతుందన్నారు.

 ఎమ్మెమ్మార్డీయే కమిషనర్ యూపీఎస్ మదన్ మాట్లాడుతూ.. ఈ పనుల పూర్తికి తమకు మరో వారం రోజులు సమయం అదనంగా పడుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లైఓవర్ దక్షిణ దిశ భాగాన్ని జూన్ మొదటివారంలో ప్రారంభిస్తామన్నారు. ఈ పనులకు సంబంధించిన కాంట్రాక్టు గత ఏడాది జె.కుమార్ సంస్థకు దక్కిందని, అయితే ట్రాఫిక్ పోలీసుల అనుమతి లభించే వరకు పనులు ప్రారంభం కాలేదన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ఆరు నెలల ముందే ఈ పనులను పూర్తి చేయాలనే లక్ష్యంతో నవంబర్‌లో ఈ పనులు ప్రారంభించాలనుకున్నామన్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల తీవ్ర జాప్యమైందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement