ముంబైకర్లకు ‘మోనో’త్సాహం | mono trains are started | Sakshi
Sakshi News home page

ముంబైకర్లకు ‘మోనో’త్సాహం

Published Mon, Feb 3 2014 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:17 AM

ముంబైకర్లకు ‘మోనో’త్సాహం

ముంబైకర్లకు ‘మోనో’త్సాహం

 ముంబై:
 దేశంలోనే తొలిసారిగా ప్రారంభమైన ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన రవాణా వ్యవస్థ మోనో రైలు సేవల అనుభూతిని ముంబైకర్లు ఆస్వాదిస్తున్నారు. ఈ సేవలకోసం నగరవాసులు ఎంతోకాలంగా ఎదురుచూసిన సంగతి విదితమే. ఎంతో విశ్వసనీయమే అయినప్పటికీ మురికిపట్టిన, అసౌకర్యవంతమైన శివారు రైళ్లు, బెస్ట్ సంస్థకు చెందిన బస్సుల్లో ఇన్నాళ్లూ నానాయాతన పడుతూ రాకపోకలు సాగించిన ముంబైకర ్లకు తాజాగా అందుబాటులోకి వచ్చిన మోనో రైలు ప్రయాణం ఎనలేని ఆనందం కలిగిస్తోంది. ఎన్నో విజయవంతమైన ప్రయోగాత్మక పరుగుల తర్వాత శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఈ సేవలను ప్రారంభించిన సంగతి విదితమే.
 
  ఆదివారం ఉద యం నుంచి మోనో రైలు సేవలు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైళ్లు ఆకుపచ్చ, నీలం, నలుపు, గులాబీ రంగుల్లో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. అంతేకాకుండా ఇవన్నీ పర్యావరణ అనుకూలమైనవి కూడా. ఇక ఈ రైళ్ల లోపలిభాగం, ప్లాట్‌ఫాంలు ప్రయాణికులను కట్టిపడేస్తున్నాయి. 20 అడుగుల వెడల్పు, 5.5 అడుగుల ఎత్తు లో వీటిని నిర్మించారు. కొన్ని ప్రాంతాల్లో ఐదున్నర అడుగులకంటే ఎక్కువఎత్తులో నిర్మించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఆయా స్టేషన్ల వద్ద త్వర లో ఎస్కలేటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ మార్గం లో ప్రయాణికులు తమ తమ గమ్యస్థానాలను 20 నిమిషాల వ్యవధిలోనే చేరుకోవచ్చు. మోనో రైలు ప్రయాణికులకు గోల్ఫ్‌కోర్సులు, ఆకు పచ్చని మడఅడవులు, పొగమంచు ఆవరించిన పర్వతశ్రేణులు కనువిందు చేస్తున్నాయి.
 
 ఈ సందర్భంగా ఎంఎంఆర్‌డీయే జాయింట్ డెరైక్టర్ డి కవత్కర్ మాట్లాడుతూ మోనో రైలు మొత్తం ఏడు స్టేషన్లలో ఆగుతుందన్నారు. ఈ మార్గం పొడవు 8.9 కిలోమీటర్లని అన్నారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement