సాక్షి, న్యూఢిల్లీ: విద్యా ప్రమాణాల మెరుగు కోసం అధ్యాపకులు కృషి చేయాలని లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పిలుపు ఇచ్చారు. ఉన్నత విద్యా విభాగం, ఎన్‌సీటీలు సంయుక్తంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఢిల్లీ యూనివర్సి టీ పరిధిలోని కళాశాలల్లో పనిచేస్తున్న 10మంది ప్రతిభావంతులైన అధ్యాపకులను ఎల్జీ సన్మానించారు. అధ్యాపకులు విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ వారి జీవితాలను ప్రభావితం చేయాలని చెప్పారు. అంకితభావం కలిగిన అధ్యాపకుల సేవల అవసరం దేశానికి ఉందని ఆయన చెప్పారు. ఉన్నత విద్యామండలి ప్రిన్సిపల్ సెక్రటరీ అనిందో మజుమ్‌దార్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలోప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీఎం స్పోలియా, జీజీఎస్‌ఐపీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ కే.త్యాగి, ఉన్నత విద్యామండలి డెరైక్టర్ అచల్‌సింగ్, వివిధ కాలేజీలకు చెందిన అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలకు సంపూర్ణ రక్షణ
నగరంలో మహిళల భద్రతకు పెద్దపీట వేస్తున్నామని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ అన్నారు. డిసెంబర్ 16 గ్యాంగ్‌రేప్ ఘటన జరిగి రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా ఎల్జీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. మహిళలపై నేరాల సంఖ్య తగ్గించడం కోసం అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ఇందుకోసం ప్రజలను చైతన్యం చేయడం కోసం అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు చెప్పారు. మహిళపై ఆరోజు జరిగిన ఘటన దురదుష్టకరమని, ఇంకా దురాఘాతాలు కొనసాగడం దేశానికే తలవంపులని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పక డ్బందీ చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ప్రతీ పోలీస్ స్టేషన్‌లో ‘మహిళా సెల్’ ఏర్పాటు చేయిస్తున్నామని, మహిళల రక్షణ కోసం నగరంలో పలుచోట్ల సీసీటీవీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
విద్యాప్రమాణాలు మెరుగుపర్చాలి: ఎల్జీ
Published Tue, Dec 16 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 6:16 PM
Advertisement