హైకోర్టులో నేటి నుంచి విచారణ | Nirbhaya case: HC issues production warrant to death row convicts | Sakshi
Sakshi News home page

హైకోర్టులో నేటి నుంచి విచారణ

Published Wed, Sep 25 2013 2:10 AM | Last Updated on Wed, Oct 17 2018 5:51 PM

Nirbhaya case: HC issues production warrant to death row convicts

న్యూఢిల్లీ: ‘నిర్భయ’ సామూహిక అత్యాచారం కేసు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు నలుగురు అపరాధులకు ఉరిశిక్ష విధించడంపై ఢిల్లీ హైకోర్టులో బుధవారం నుంచి విచారణ మొదలవనుంది. దీనిపై రోజువారీ విచారణ నిర్వహిస్తామని న్యాయమూర్తులు రేవాఖేత్రపాల్, ప్రతిభారాణితో కూడిన బెంచ్ ప్రకటించింది. ఉరిశిక్షను సవాలు చేస్తూ అపరాధుల తరఫు న్యాయ వాదులు పిటిషన్లు వేయడానికి అనుమతించింది. అయితే పిటిషన్లు వేయడానికి వారం రోజులు గడువివ్వాలన్న వీరి విజ్ఞప్తిని తిరస్కరించింది.
 
 వాదనలు ముగిసేలోపు పిటిషన్లు వేసినా సరిపోతుందని సూచించింది. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మరణశిక్ష విధించిన ముకేశ్, వినయ్‌శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్‌గుప్తాను తమ ఎదుట మంగళవారం హాజరుపర్చాలని బెంచ్ ఆదేశించడం తెలిసిందే. దీంతో వీరంతా బుధవారం విచారణకు హాజరయ్యారు. కోర్టుకు వచ్చిన ఇతర న్యాయవాదులు, వ్యాజ్యదారులు ఈ నలుగురిని చూడడానికి ఎగబడ్డారు.  
 
 ముకే శ్, అక్షయ్‌ఠాకూర్, పవన్‌గుప్తా, వినయ్‌శర్మకు ఉరిశిక్ష విధిస్తూ ఈ నెల 13న తీర్పు చెప్పడం తెలిసిందే. తాము విధించిన శిక్షను ధ్రువీకరించాలని అడిషనల్ సెషన్స్‌జడ్జి యోగేశ్‌ఖన్నా హైకోర్టుకు విన్నవించారు. నిబంధనల ప్రకారం దిగువకోర్టులు ఉరిశిక్షలు విధిస్తూ తీర్పు చెబితే తుదినిర్ణయం కోసం హైకోర్టును సంప్రదించడం తప్పనిసరి.  నిర్భయపై గత ఏడాది డిసెంబర్ 16న సామూహిక అత్యాచారం జరగడం తెలిసిందే. చికిత్స పొందుతూ ఆమె అదే నెల 29న మరణించింది. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement