సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి ఎంసీడీల్లోని పింఛన్లకు సంబంధించి దాదాపు రూ.77 కోట్లు నిలిపివేయడాన్ని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ సర్కార్ రాజకీయ ఉద్దేశాలతోనే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కౌన్సిలర్లను వాడుకుని రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఏప్రిల్ నుంచి జూలైకి సంబంధించిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లకు సంబంధించిన నిధులను నిలిపివేయడంపై మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్లు కాంగ్రెస్‌పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు.
పింఛన్లు నిలిపివేతకు కారణాలపై ముగ్గురు మున్సిపల్ కమిషనర్ల నుంచి వివరణ తీసుకోవాలని మూడు మున్సిపాలటీల మేయర్లకు సూచించారు.‘దాదాపు రెండు లక్షల మందిపై ఈ ప్రభావం పడనుంది. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి పింఛన్లను ఆపడం సరికా దు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ జీతాలు, పింఛన్లు నిలిపివేయొద్దన్న నిబంధన ఎన్నికల సంఘంలో ఉన్నట్టు నాకు గుర్తు’అని గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో చెల్లించాల్సిన పింఛన్ల నిధులు విడుదల చే సినా, ఎంసీడీల్లో కమిషనర్లు రాజకీయ దురుద్దేశంతోనే నిలిపివేస్తున్నారన్నారు. ఇలా చేయడంతో ఎంసీడీల్లో అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత పెంచవచ్చన్నదే కాంగ్రెస్ వ్యూహమని పేర్కొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి పేదల ఇబ్బందులను అర్థం చేసుకోవాలని గోయల్ సూచించారు.
పింఛన్లలోనూ రాజకీయమా..!!
Published Fri, Oct 25 2013 11:48 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
Advertisement
Advertisement