Vijay Goyal
-
కేజ్రీవాల్‌కు భారీ షాక్
న్యూఢిల్లీ : పోలింగ్‌కు ఓ పది రోజుల ముందు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. ఆప్ ఎమ్మెల్యే ఒకరు శుక్రవారం బీజేపీలో చేరారు. కాషాయ పార్టీ ఆప్ ఎమ్మెల్యేలను కొనడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది అంత సులభం కాదని కేజ్రీవాల్ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. గాంధీ నగర్ ఆప్ ఎమ్మెల్యే అనిల్ బాజ్‌పేయి పార్టీని వీడి.. బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సమక్షంలో శుక్రవారం అనిల్ బాజ్‌పేయి కాషాయ కండువా కప్పుకున్నారు. ఏడు లోక్‌సభ స్థానాలున్న ఢిల్లీలో మే 12న ఒకే విడతలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ ఎమ్మెల్యే బీజేపీలో చేరడం కేజ్రీవాల్‌కు తీవ్ర నష్టం కల్గిస్తుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే బీజేపీ పార్టీ తమను అధికారంలోంచి దించడానికి ప్రయత్నిసుందని.. ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలకు రూ. 10 కోట్లు ఆఫర్ చేసి ప్రలోభాలకు గురి చేస్తోందని కొన్ని రోజుల క్రితమే ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు. కేజ్రీవాల్ కూడా ఈ రోజు దీనిపై స్పందించారు. ‘గోయెల్‌జీ.. బేరసారాలు ఎంత వరకు వచ్చాయి. మీరు ఎంత ఇస్తున్నారు. మా ఎమ్మెల్యేలు ఎంత డిమాండ్ చేస్తున్నారు. మోదీజీ.. ఆయా రాష్ట్రాల్లో మీ ప్రత్యర్థి పార్టీలు ఏర్పాటు చేసిన ప్రతి ప్రభుత్వాన్ని కూలదోస్తారా? ఇదేనా మీ దృష్టిలో ప్రజాస్వామ్యమంటే? అయినా ఎమ్మెల్యేలను కొనడానికి అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు. మా ఎమ్మెల్యేల్ని కొనడానికి మీరు చాలా సార్లు ప్రయత్నించారు. అయినా ఆప్ ఎమ్మెల్యేలను కొనడం అంత సులభం కాదు’’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యలను విజయ్ గోయల్ ఖండించారు. ఆప్ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని విజయ్ గోయల్ స్పష్టం చేశారు. ఆప్ విధానాలతో విసిగిపోయిన 14 మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడడానికి సిద్ధంగా ఉన్నారని కేంద్ర మంత్రి విజయ్ గోయెల్ అన్నారు. -
బీజేపీలోకి ప్రముఖ సింగర్ దలేర్ మెహందీ
న్యూఢిల్లీ: ప్రముఖ పంజాబీ సింగర్ దలేర్ మెహందీ శుక్రవారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి విజయ్ గోయల్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వాయవ్య ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న హన్స్‌రాజ్ హన్స్తదితరులు పాల్గొన్నారు. హన్స్‌రాజ్ కుమారుడితో మెహందీ కుమార్తె వివాహం జరిగిన విషయం తెలిసిందే. -
సగటుజీవికి ఊరట
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని సామాన్యులకు ఊరటని చ్చేందుకే ఈ ఏడాది ఎంసీడీల పరిధిలోని పార్కింగ్ రేట్లు, హౌసింగ్ ట్యాక్స్‌లు పెంచకూడదని నిర్ణయించినట్టు బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం పండిత్ పంత్‌మార్గ్‌లోని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ కార్యాలయంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్ల నాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఎంసీడీల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో గోయల్ మాట్లాడారు. ఎంసీడీల పనితీరులో పారదర్శకత పెంచడంతోపాటు ప్రజలకు మరింత చేరువ య్యేందుకు బీజేపీ కృషి చేస్తోందన్నారు. దీనిలో భాగంగానే బీజేపీ అధికారంలో ఉన్న ఎంసీడీల పరిధిలోని పార్కింగ్ రేట్లు, హౌసింగ్ ట్యాక్స్‌లు పెంచడం లేదన్నారు. హోటళ్లు, బంక్వెట్ హాళ్లుగా మార్చిన ఫామ్ హౌస్‌ల విషయంలో కొద్దిమేర మార్పులు చేసినట్టు తెలిపారు. వీటన్నింటి వివరాలు ఆన్లైన్లో పొం దుపరుస్తున్నట్టు తెలిపారు. ఎంసీడీల పరిధిలో తీసుకోబోయే నిర్ణయాలను వివరించారు. కమ్యూనిటీహాళ్లు బుకింగ్‌తోసహా 64 అంశాలకు సంబంధించిన చెల్లింపులు, ఇతర అంశాల వివరాలు ఆన్లైన్లో పొందుపరుస్తారు. ఎలక్ట్రానిక్ క్లియరెన్స్ స్కీం(ఈసీఎస్) ద్వారా కాంట్రాక్టర్లకు నిధులు చెల్లిస్తారు. ఈసీఎస్ ద్వారానే ఎంసీడీ ఉద్యోగుల జీతభత్యాలను కూడా చెల్లిస్తారు. చారిత్రక ప్రదేశాలపై ప్రాపర్టీ ట్యాక్స్‌ను తొలగిస్తారు. ఎయిడెడ్ పాఠశాలలపై ప్రాపర్టీ ట్యాక్స్‌ను తగ్గిస్తారు. -
ఆప్ వెనకడుగువే స్తోంది: గోయల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో ఆమ్ ఆద్మీ పార్టీ వెనక్కి తగ్గుతోందని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ ఆరోపించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. గురువారం నిర్వహించిన ఢిల్లీ బీజేపీ ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీలో ఉప ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వారికి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎంతో కృషి చేసిన పార్టీ నాయకులను అభినందిస్తున్నారన్నారు. ‘బీజేపీకి పార్టీ కేడర్ ఉంది. ఢిల్లీలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికైనా మేం సిద్ధంగా ఉంటాం. ఆప్ పూర్తిగా కాంగ్రెస్ పార్టీ చెప్పుచేతల్లో ఉంద’ని ఆరోపించారు. ఆప్ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ మద్దతు ఇస్తామని చెప్పడంతోనే వారి మధ్య ఉన్న బంధం తెలిసిందన్నారు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆప్ ఎందుకు వెనుకంజ వేస్తుందో చెప్పాలన్నారు. తాను చేసిన వాగ్ధానాలు నెరవేర్చలేనన్న అనుమానంతోనే ఆ పార్టీ నాయకులు ప్రభుత్వ ఏర్పాటులో సంశయంతో ఉన్నారన్నారు. ఆప్ ఇచ్చిన హామీలు ఆచరణ యోగ్యం కావని వారికి అర్థమైందన్నారు. వారికి ప్రజాస్వామ్యాన్ని బలపర్చాలన్న ఉద్దేశం ఉంటే పాజిటివ్ అజెండాతో పనిచేయాలన్నారు. హామీలు నెరవేర్చలేమనే భయం: కాంగ్రెస్ ఆచరణ యోగ్యం కాని హామీలను ప్రజలకిచ్చి అధిక సీట్లను సాధించిన బీజేపీ, ఆప్‌లు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు వెనుకంజ వేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే ఆ హామీలను నెరవేర్చలేమన్న భయంతోనే ముందుకు రావడం లేదని ఆ పార్టీ ఎంపీ సంజయ్ నిరూపమ్ గురువారం విలేకరులకు తెలిపారు. మరో ఆరునెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోపు హామీలు నెరవేర్చకపోతే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భయపడుతున్నాయని విమర్శించారు. -
పింఛన్లలోనూ రాజకీయమా..!!
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి ఎంసీడీల్లోని పింఛన్లకు సంబంధించి దాదాపు రూ.77 కోట్లు నిలిపివేయడాన్ని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్ గోయల్ తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ సర్కార్ రాజకీయ ఉద్దేశాలతోనే మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కౌన్సిలర్లను వాడుకుని రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఏప్రిల్ నుంచి జూలైకి సంబంధించిన వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పింఛన్లకు సంబంధించిన నిధులను నిలిపివేయడంపై మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్లు కాంగ్రెస్‌పార్టీకి కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. పింఛన్లు నిలిపివేతకు కారణాలపై ముగ్గురు మున్సిపల్ కమిషనర్ల నుంచి వివరణ తీసుకోవాలని మూడు మున్సిపాలటీల మేయర్లకు సూచించారు.‘దాదాపు రెండు లక్షల మందిపై ఈ ప్రభావం పడనుంది. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి పింఛన్లను ఆపడం సరికా దు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ జీతాలు, పింఛన్లు నిలిపివేయొద్దన్న నిబంధన ఎన్నికల సంఘంలో ఉన్నట్టు నాకు గుర్తు’అని గోయల్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వం పరిధిలో చెల్లించాల్సిన పింఛన్ల నిధులు విడుదల చే సినా, ఎంసీడీల్లో కమిషనర్లు రాజకీయ దురుద్దేశంతోనే నిలిపివేస్తున్నారన్నారు. ఇలా చేయడంతో ఎంసీడీల్లో అధికారంలో ఉన్న బీజేపీపై వ్యతిరేకత పెంచవచ్చన్నదే కాంగ్రెస్ వ్యూహమని పేర్కొన్నారు. రాజకీయాలు పక్కన పెట్టి పేదల ఇబ్బందులను అర్థం చేసుకోవాలని గోయల్ సూచించారు. -
మేం గెలిస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం : విజయ్ గోయల్
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని భారతీయ జనతా పార్టీ ఢిల్లీ అధ్యక్షుడు విజయ్ గోయల్ ప్రకటించారు. రాజధానిలో తక్కువ ధరలకే విద్యుత్ సరఫరా చేస్తున్నామని ముఖ్యమం త్రి షీలాదీక్షిత్ పదేపదే ప్రచారం చేసుకుంటూ ప్రజ లను మోసగిస్తున్నారని విజయ్‌గోయల్ ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యుత్ చార్జీలు 30శాతం తగ్గిస్తాం అన్న మాటకు తమ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. గురువారంనాడు ఆయన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘విద్యుత్ చార్జీలు ఛత్తీస్గడ్,ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానాతో పోలిస్తే ఢిల్లీలో అనేక రెట్లు అధికంగా ఉంది. తప్పుడు లెక్కలు చూపుతూ ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు’ అని ఆయన విమర్శించారు. విద్యుత్ పంపిణీ సంస్థలతో కుమ్మక్కై రెండేళ్లలోనే 72 శాతం విద్యుత్ చార్జీలు పెంచారని ఆరోపించారు. పదేళ్లలో 300 శాతం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుంటుంబాలకు సైతం వేల రూపాయల్లో విద్యుత్ బిల్లులు వస్తున్నాయని ఆయన వివరించారు. విద్యుత్ కంపెనీల మధ్య పోటీ పెంచడంతోపాటు పారదర్శకతతో విద్యుత్ చార్జీలను 30 శాతం తగ్గిస్తాం అన్న మాటకు కట్టుకబడి ఉన్నామని, తాము గెలిస్తే ప్రజలకు విద్యుత్‌షాక్‌లు ఉండవని చలోక్తి విసిరారు. -
ప్రాణం విలువ తెలియదు : విజయ్‌గోయల్
సాక్షి, న్యూఢిల్లీ: ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే ఆ తప్పును ఎంసీడీలపై వేసి తప్పుకునేందుకు ఢిల్లీ సర్కార్ ప్రయత్నిస్తుందని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ధ్వజమెత్తారు. ప్రాణాల విలువ కాంగ్రెస్‌పార్టీ ప్రభుత్వానికి తెలియదంటూ దుయ్యబట్టారు. బుధవారం ఉదయం 7-30 గంటలకు బారాహిందురావ్ ప్రాంతంలో భవనం కూలిన ప్రదేశాన్ని ఆయన సంద ర్శించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ‘ప్రభుత్వ ప్రతిసారీ ఎంసీడీలవైపు వేలెత్తి చూపడం మానుకుని, పాత నగరం ప్రాధాన్యతను గుర్తించి పునరుద్ధరణ పనులు సకాలంలో చేపట్టపోవడంతోనే ప్రమాదం జరిగింద’ని అన్నారు. చాందినీ చౌక్ ప్రాంతంలో ఎన్నో పురాతన భవనాలు శిథిలావస్థకు చేరాయన్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఏ ప్రమాదం జరిగినా ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం పునరాభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. పదిహేనేళ్ల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి ప్రమాదాలు ఎన్నో జరిగినా ప్రభుత్వంవైపు చర్యలు శూన్యంగా ఉన్నాయన్నారు. ఢిల్లీ మాస్టర్ ప్లాన్-2021లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయించింది. దీన్ని షాహజానాబాద్ రీ-డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎస్ఆర్డీసీ) ఆధ్వర్యంలో నిధులను విడుదల చేయాల్సి ఉంది. వీటిని ఎంసీడీ పరిధిలో ఖర్చుచేసి పునరాభివృద్ధి పనులు కొనసాగించాలి. కానీ రాజకీయ కారణాలతో ఢిల్లీ సర్కార్ ఈ విషయాన్ని తొక్కిపడుతూ వస్తోందని గోయల్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ రోజు ప్రమాదానికి కారణమైందన్నారు. ఈ ప్రాంతంలో జూలై 2007,సెప్టెంబర్ 2011,ఆగస్టు 2013న ప్రమాదాలు జరిగాయన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే పునరాభివృద్ధి పనులను వెంటనే చేపడతామని హామీ ఇచ్చారు.