జయలలితకు కెప్టెన్ భార్య సవాల్ | Premalatha Vijayakanth Challenges Jayalalithaa | Sakshi
Sakshi News home page

జయలలితకు కెప్టెన్ భార్య సవాల్

Published Sun, Feb 21 2016 9:30 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

జయలలితకు కెప్టెన్ భార్య సవాల్

జయలలితకు కెప్టెన్ భార్య సవాల్

టీనగర్: ముఖ్యమంత్రి జయలలితకు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ సతీమణి ప్రేమలత బహిరంగ సవాల్ విసిరారు. జయలలిత 234 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగలరా? అంటూ ప్రశ్నించారు. కాంచీపురంలో మహానాడు ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చిన ప్రేమలత విలేకరులతో మాట్లాడారు. ఈ మహానాడులో విజయకాంత్ ప్రకటన కోసం రాష్ట్రం, దేశమే కాకుండా ప్రపంచమే ఎదురుచూస్తోందన్నారు.
 
ఎంజిఆర్ వరుసగా మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యారని, అలా జయలలిత ఎందుకు కాలేకపోయారని వ్యంగ్యాస్త్రం సంధించారు. రెండుసార్లు ఓ.పన్నీర్ సెల్వంకు అధికారాన్ని అప్పజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత 2011 అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్‌తో పొత్తు కోసం ఇంటి వాకిటికి రాయబారం పంపారన్నారు. గతంలో మొట్టమొదటి సారిగా అభ్యర్థుల జాబితా ప్రకటించారని, అయితే ఈ దఫా అలా చేయగలరా? అని ప్రశ్నించారు. ఆమెకు ధైర్యం ఉన్నట్లయితే ఆదివారమే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని సవాలు విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement