నగరంలో కాంగ్రెస్ నేత, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 23వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది.
ముంబై: నగరంలో కాంగ్రెస్ నేత, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ 23వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. రాజీవ్ గాంధీ భవన్‌లో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నేతలు నివాళులు ఆర్పించారు. ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
అనంతరం మంత్రాలయకు చేరకున్న సీఎం పృథ్వీరాజ్ చవాన్ అక్కడ రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నగరంతో పాటు వివిధ జిల్లాల్లో కాంగ్రెస్ నాయకులు రాజీవ్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. రాజకీయాల్లో మంచి మార్పు తీసుకొచ్చిన నేత అని స్మరించుకున్నారు. కాగా, నగరంలోని రాజ్ భవన్‌లో గవర్నర్ కె.శంకర్ నారాయణన్ సిబ్బం దితో ఉగ్రవాద వ్యతిరేక ప్రతిజ్ఞ చెయ్యించారు.