వైద్య విద్యార్థినిపై అత్యాచారం | Rape on medical student | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థినిపై అత్యాచారం

Published Tue, Sep 13 2016 2:30 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

వైద్య విద్యార్థినిపై అత్యాచారం - Sakshi

వైద్య విద్యార్థినిపై అత్యాచారం

కేకే.నగర్: మహాబలిపురానికి స్నేహితులతో విహారయాత్రకు వచ్చిన ఎస్‌ఆర్‌ఎం వైద్య కళాశాల విద్యార్థినిపై అత్యాచారం జరిగిన సంఘటన సంచలనం కలిగించిం ది. కేరళ రాష్ట్రం పాలక్కాడు జిల్లాకు చెందిన యువతి(28) ఎంబీబీఎస్ పూర్తి చేసి కాట్టాంగళత్తూరు ఎస్‌ఆర్‌ఎం వైద్య కళాశాలలో ఎంఎస్(రేడియాలజీ) చదువుతోంది. చెన్నైలోని బీసెంట్‌నగర్‌లోని లేడీస్ హాస్టల్‌లో ఉండి ప్రతిరోజు కళాశాలకు వెళ్లి వస్తుంది. ఈమె ప్రైవేటు సంస్థలో పని చేసే దీపక్ (29) అనే వ్యక్తిని ప్రే మిస్తోంది. గత శనివారం రాత్రి యువతి, దీపక్ చెన్నై ఐఐటీలో పీహెచ్‌డీ చేస్తున్న నసికేతతో కలిసి మహాబ లిపురం వెళ్లారు.
 
 అక్కడ అన్ని ప్రాంతాలను చూసి అనంతరం మద్యం సేవించినట్టు తెలిసింది. మత్తు తలకెక్కడంతో ఇంటికి వెళ్లలేక మహాబలిపురంలోని ప్రైవేటు హోటల్ లో గది తీసుకుని బస చేశారు. ఈ నేపథ్యంలో ఆది వారం ఉదయం హోటల్‌లో పని చేసే ఇద్దరు తనపై అత్యాచారం జరిపారని యువతి హోటల్ యజమానికి చెప్పింది. వెంటనే యజమాని ఇచ్చిన సమాచారం మేరకు మహాబలిపురం పోలీసు డీఎస్పీ శేఖర్, ఇన్‌స్పెక్టర్ చిరంజీవి, పోలీసులు యువతి ఉన్న గదికి వెళ్లి విచారణ జరిపారు. అనంతరం పోలీసులు యువతితో పాటు బస చేసిన దీపక్, నసికేత, హోటల్ సిబ్బంది విజయరాఘవన్‌లను విచారణకు పిలుచుకుని వెళ్లారు.
 
  ఆమె అత్యాచారానికి గురైనట్లు చెప్పేది నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు ఆ నలుగురిని చెంగల్పట్టు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు జరిపారు. అందులో ఆమెపై అత్యాచారం జరిగిన విషయం నిజమని తేలింది. అయితే నిందితుల వివరాలు తెలియక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా మహాబలిపురంలోని హోటల్‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ సంఘటన జరిగిన హోటల్‌లో కెమెరా ఏర్పాటుచేసినా అది పని చేయడం లేదని తెలుస్తోంది. దీని వలన యువతి గదికి వచ్చి వెళ్లింది ఎవరనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement