సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాసామ్యంలో ఓటుహక్కు ఎంతో విశిష్టమైనది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) వచ్చిన తర్వాత ఓటు సరిగా వేశామోలేదో, తాను అనుకున్న పార్టీకే పడిందో లేదో అన్న అనుమానాలు ఓటర్లమదిని తొలి చేవి.
నిశ్చింతగా ఓటు హక్కు
Published Fri, Oct 18 2013 1:28 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ : ప్రజాసామ్యంలో ఓటుహక్కు ఎంతో విశిష్టమైనది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం) వచ్చిన తర్వాత ఓటు సరిగా వేశామోలేదో, తాను అనుకున్న పార్టీకే పడిందో లేదో అన్న అనుమానాలు ఓటర్లమదిని తొలి చేవి. వాటిని నివృత్తి చేయడంతోపాటు ఓటరు కు మరింత సమాచారం అందించేలా ఎన్నికల సంఘం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. దీని ప్రకారం ఓటు తన ఓటును ఏ పార్టీకి వేశాడో తెలుసుకోవడం సులవుగామారుతుంది. డిసెంబరులో నిర్వహించనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తేనున్నారు. ఇందుకోసం మొట్టమొదటిసారి గా ఓటర్ వెరిఫికేషన్ పేపర్ ఆడిట్‌ట్రేల్‌ను (వీ వీపీఏటీ) వాడనున్నారు. ఇప్పటికే ఈ విధానా న్ని ఒక రాష్ట్ర విధానసభ ఎన్నికల్లో పైలట్ ప్రాజెక్టు కింద విజయవంతంగా పూర్తిచేసినట్టు ఢిల్లీ ఎన్నికల అధికారి విజయ్‌దేవ్ పేర్కొన్నారు.
వీవీపీఏటీ అంటే ఏమిటి?
గతంలో మన దేశంలో బ్యాలెట్ పేపర్‌తో ఓట్లు వేసేవారు. తాము ఎంపిక చేసిన పార్టీ గుర్తుపై ఓటు ముద్రవేసి ఓటు వేసేవాడు. ఈవీఎంలు వచ్చిన తర్వాత తమ ఓటు ఎవరికి వేశామో తెలియని అయోమంలో కొందరు ఓటర్లు ఉంటున్నారు. వారికి ఊరట కలిగిస్తూ ఎలక్షన్ కమిషన్.. వీవీపీఏటీని ఇటీవలే ప్రవేశపెట్టింది. ఈవీఎం మెషీన్‌కి వీవీపీఏటీని అనుసంధానం చేస్తారు. ఓటు ఓటుహక్కు వినియోగించుకున్న వెంటనే అతడు/ఆమె ఏ పార్టీకి ఓటు వేశాడో తెలిపే చీటీ ఈ మెషీన్ ఇస్తుంది. దీంతో తాను ఏ పార్టీకి ఓటు వేశాడో ఓటు స్పష్టంగా తెసుకోవచ్చు. అనంతరం చీటిని అక్కడే ఉన్న డబ్బాలో జమచేయాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని ఈ ఎన్నికల్లో అమలులోకి తేవడంపై త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల సంఘం అధికారి ఒకరు అన్నారు.
Advertisement
Advertisement