
సాయిబాబాను పూజించడం వల్లే కరువొచ్చింది
శంకరాచార్య స్వరూపనంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షిర్డీ సాయిబాబాను పూజించడం వల్లే మహారాష్ట్రలో కరువు వచ్చిందని అన్నారు.
ముంబై: శంకరాచార్య స్వరూపనంద స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షిర్డీ సాయిబాబాను పూజించడం వల్లే మహారాష్ట్రలో కరువు వచ్చిందని అన్నారు. మహారాష్ట్రలో ప్రత్యేకించి షిర్డీ ప్రాంతంలో సాయిబాబాను ఆరాధించారని, అందుకే కరువు, నీటికొరత ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
శనిసింగాపూర్ ఆలయ గర్భగుడిలోకి మహిళలు ప్రవేశించడానికి అనుమతి ఇవ్వడాన్ని శంకరాచార్య స్వరూపనంద స్వామి తప్పుపట్టారు. దీనివల్ల భవిష్యత్లో అత్యాచారాలు పెరుగుతాయని చెప్పారు.