గ్రామాల నుండి కర్రలతో వెళ్తున్న భక్తజనం
కర్ణాటక, దొడ్డబళ్ళాపురం : సాంప్రదాయాలకు, సంస్కృతికీ పెట్టిందిపేరు భారతదేశం...ఇక్కడ ఆచరించే ధా ర్మిక ఆచరణలు పైకి మాఢనమ్మకంలా కనిపించి నా ఆ ఆచరణ వెనుక బలమైన కారణాలు, నేపథ్యం ఉంటాయి. ఇలాంటి ఆచరణలు గ్రామాల్లో అధికంగా కనిపిస్తాయి. ఈ ఆధునిక యుగంలోనూ ఇలాంటి ధార్మిక ఆచరణ ఒకటి ఉందంటే అతిశయోక్తి కాదుమరి.. జాతరలో జనం వెర్రెత్తి, కత్తులు, కట్టెలు, మారణాయుధాలు గట్రా చేతబట్టి కొట్టుకుంటూ, జంతువులను వేటాడ్డం మీకు తెలుసా? ...దొడ్డబళ్లాపురం తాలూకాలోని హులికుంటె గ్రామంలో ఇలాంటి జాతరే ఒకటి గత ఆరు వందల సంవత్సరాలుగా ఆచరించబడుతూ వస్తోంది. గురువారం సాయంత్రం హులికుంటలో ఈ జాతరను అత్యంత వైభవంగా ఆచరించారు.
నేపథ్యం : జాతరకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలను గ్రామస్తులు చెబుతారు. మాగడి తాలూకా ఆరాధ్య దైవం రంగనాథస్వామి, దొడ్డబళ్లాపురం తాలూకా హణబె, చుట్టు పక్కల గ్రామస్తుల ఇష్టదైవం హణబె రంగనాథ, హులికుంటె చుట్టు పక్కల గ్రామస్తుల దేవుడు హులికుంటె రంగనాథస్వామి ముగ్గురూ కలిసి హులి టలో రంగనాథ స్వామి గుడి కట్టించి యుద్ధానికి సిద్ధమవుతారు. యుద్ధం ఎందుకు జరిగిందీ గ్రామస్తులు వివరించరు. అది దైవ రహస్యంగా భావిస్తారు. వేట రంగనాథ హూవాడిగ నాయకులను గుర్రాలుగా చేసుకుని సంగీత వాద్యాలతో యుద్ధానికి బయలు దేరతాడు. దారి మధ్యలో చన్నబసవయ్య నపాళ్య వద్ద పాము పుట్టకు పూజలు చేసి, కట్టెలు అంటించి పొగబెట్టి బలి కావాలని గగ్గోలు పెడుతూ ముందుకు సాగుతాడు. ఈ తతంగాన్నే జాతరలో కీలక భాగంగా భావించి ఇప్పటికీ ఆచరించడం ప్రత్యేకత. అక్కడి నుండి కాస్త దూరంలోనే రంగ నాథస్వామికి మంచి వేట దొరికింది. వేట దొరికిన స్థలంలోనే ఒక మండపాన్ని కట్టి ఆ స్వామిని శాంతింపజేయడం జరిగింది. నేటికీ అదే మండపం వద్ద రంగనాథ స్వామికి వేట ముగిసాక ప్రత్యేక పూజలు జరుగుతాయి. అప్పుడు జరిగింది యుద్ధమా? లేక వేటా? అనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ ఈ జాతరను ‘ కోలు బేటె ’ (కట్టెల వేట) జాతరగానే పిలుస్తారు.
ఎప్పుడు జరుగుతుంది? : ప్రతి సంవత్సరం డిసెంబరు నెల చివరి గురువారం ఈ జాతర ఆచరిస్తారు. పండిన పంటల కోతలు కోసి ధాన్యాన్ని పొలాల్లోనే సేకరించి ఉంచడం అప్పడు పరిపాటిగా ఉండేది. ధాన్యాన్ని అడవి జంతువులు, ఇతర ప్రాణుల నుండి రక్షించుకునేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు ఇలాంటి వైవిధ్యమైన జాతరకు శ్రీకారం చుట్టారని కూడా చెబుతారు. మరో సమాచారం ప్రకారం ఒకప్పుడు హులికుంట, చుట్టుపక్కల గ్రామాల పరిసరాల్లో దట్టమైన అరణ్యం ఉండేది. డిసెంబరు నెలలో కుందేళ్ల బెడద ఎక్కువగా ఉండేదట. వాటిని నియంత్రించడానికే ఈ వేట పండగ ఆచరిస్తారట. పదిహేను సంవత్సరాల క్రితం వరకూ జాతరలో భాగంగా జనం అడవుల్లో తిరిగి నిజంగానే అడవి జంతువులను వేటాడి తెచ్చి రంగనాథస్వామికి నైవేద్యంగా పెట్టేవారు. అయితే జంతువులను వేటాడ్డం చట్ట విరుద్ధం కావడం వల్ల ఇటీవల జంతువుల వేట కేవలం నామమాత్రానికే మిగిలింది. హలికుంటలోని రంగనాథ స్వామి దేవాలయం నుండి స్వామిని పల్లకీలో ఊనేగింపుగా తీసుకువచ్చి గ్రామం శివాలోగల రంగనాథ స్వామి మండపం వద్ద దించి ప్రత్యేక పూజలు చేసి జాతర ఆచరిస్తారు. ఈ జాతరకు చుట్టుపక్కల 160 గ్రామాల ప్రజలు తరలి వస్తారు. కొడవళ్లు, గొడ్డళ్లు, కత్తులు, కట్టెలు చేతబట్టి జనం సాంకేతికంగా కొట్టుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment