సాక్షి, న్యూఢిల్లీ:ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించడాన్ని సవాలుచేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌పై జులై నాలుగో తేదీన విచారణ జరపాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తరువాతనే ఢిల్లీలో రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకుంటానని లెఫ్టినెంట్ గవర్నర్ తెలి యజేయడంతో ఈ వ్యవహారంపై జులై నాలు గో తేదీన విచారణ చేపట్టనున్నట్లు సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. మే 16 తరువాతనే రాష్ట్రపతి పాలనపై నిర్ణయం తీసుకోనున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్ తెలిపినందువల్ల తమ పిటిషన్‌పై జులై మొదటివారంలో విచారణ జరపాలని ఆప్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది పాలీ నారీమన్ న్యాయస్థానాన్ని కోరారు.
ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ కూడా ఇదే విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరూ ముందుకురావడం లేదని ఆయన ప్రధాన న్యాయమూర్తి ఆర్.ఎం. లోధా నేతృ త్వంలోని ధర్మాసనానికి తెలిపారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయని, ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పరిస్థితులు మారే అవకాశముందని ప్రశాంత్ భూషణ్ చెప్పారు. రాష్ట్రపతి ఢిల్లీలో అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలు జరపడానికి చట్టపరంగా ఎటువంటి అడ్డంకీ లేదని న్యాయస్థానం అంతకు ముందు పేర్కొంది. అయితే వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా ఈ విషయంలో రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నందువల్ల ఇందుకు సంబంధించి ఎలాంటి సూచనను జారీ చేయడం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను రద్దు చేయడానికి రాష్ట్రపతి, లెప్టినెంట్ గవర్నర్‌లకు ఎలాంటి అడ్డంకి లేదని కాంగ్రెస్, బీజేపీ, ఆప్ తరఫు న్యాయవాదులు అంగీకరించిన నేపథ్యంలో న్యాయస్థానం గతంలో ఉత్తర్వు జారీ చేసింది. తన కార్యకలాపాలు రాజ్యాంగబద్ధమైన అంశాలకు మాత్రమే పరిమితమై ఉంటాయని, రాజకీయాల జోలికి తాను వెళ్లబోనని న్యాయస్థానం స్పష్టం చేసింది. రాష్ట్రపతి పాలన విధింపునకు సంబంధించి రాష్ట్రపతి, లె ఫ్టినెంట్ గవర్నర్ తీసుకున్న చర్య తప్పా లేదా ఒప్పా అనే అంశంపై తాను ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడించ డం లేదని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది.
కాగా అర్వింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం గద్దె దిగిన తరువాత అసెంబ్లీని రద్దు చేయకుండా రాష్ట్రపతిపాలన విధించడాన్ని సవాలుచేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో పిటి షన్ దాఖలు చేసింది. ఢిల్లీలో అసెంబ్లీని రద్దుచేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేసిన సిఫారసును పక్కనబెట్టిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్... శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించాలంటూ కేం ద్రానికి సిఫారసు చేసిన సంగతి విదితమే.
రాష్ట్రపతి పాలనపై ఆప్ పిటిషన్ జూలై 4న విచారణ
Published Mon, May 5 2014 11:11 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement