
కొన్ని గంటల్లో అమెరికా వెళ్లాల్సి ఉండగా..
మొబైల్‌లో మాట్లాడుతూ ఐదవ అంతస్తుపై నుంచి కిందపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు.
బెంగళూరు(బనశంకరి): మొబైల్‌లో మాట్లాడుతూ ఐదవ అంతస్తుపై నుంచి కిందపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన రాజరాజేశ్వరినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. రాజరాజేశ్వరి నగరలోని ఎస్‌వీ.రెసిడెన్సీ అపార్టుమెంటులో నవీన్‌కుమార్(21) అనే యువకుడు నివాసముంటున్నాడు. బుధవారం సాయంత్రం అపార్టుమెంటు ఐదవ అంతస్తుపై మొబైల్ లో మాట్లాడుతూ నవీన్‌కుమార్ ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు.
ఈ ప్రమాదంలో అతను ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే రాజరాజే శ్వరినగర పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేశారు. అనంతరం మృత దేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడు బుధవారం రాత్రి ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటన జరిగింది.