talking
-
వాక్కాలుష్యం
మాటల గురించి చెప్పడమంటే, మాటలు కాదుగాని, మాటల గురించి కాస్త మాట్లాడుకుందాం. మాటలు రకరకాలు. ఇతరుల మనసులను గాయపరచే ఈటెల్లాంటి మాటలు; గాయపడ్డ మనసులకు ఊరటనిచ్చే ఊరడింపు మాటలు; ఎదుటివారిని మునగ చెట్టెక్కించే మెరమెచ్చు మాటలు; జనాలను ఇట్టే బోల్తా కొట్టించే బురిడీ మాటలు; సొంత డప్పు మోగించుకోవడంలో కోటలు దాటే మాటలు; కపటబుద్ధులాడే కల్లబొల్లి మాటలు; బుద్ధిహీనుల పొల్లు మాటలు; ఈర్శ్యాళువుల ద్వేషపు మాటలు; ఉబుసుపోవడానికి చెప్పుకొనే ఊకదంపుడు మాటలు– మాటల గురించి చెప్పుకోవాలంటే, ఇలా ఎన్ని మాటలైనా ఉంటాయి. మాటలాడే తీరును బట్టి మనిషిని అంచనా వేయవచ్చు. ఎంతటి స్ఫురద్రూపులైనా కావచ్చు; మరెంతటి నానాలంకారభూషితులైనా కావచ్చు; భాషణ నైపుణ్యం కొరవడితే మాత్రం ఎన్ని ఆభరణాలను దిగేసుకున్నా, ఎన్ని అలంకారాలు చేసుకున్నా, ఎవరూ పట్టించుకోరు. ‘కేయూరాణి న భూషయంతి పురుషం హారాః న చంద్రోజ్జ్వలాః/ న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః/ వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే/ క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం’ అన్నాడు భర్తృహరి. ఇదే శ్లోకాన్ని ఏనుగు లక్ష్మణకవి ‘భూషలు గావు మర్త్యులకు భూరిమయాంగద తార హారముల్/ భూషిత కేశ పాశ మృదు పుష్ప సుగంధ జలాభిషేకముల్/ భూషలు గావు పురుషుని భూషితు జేయు పవిత్రవాణి వా/గ్భూషణమే సుభూషణము భూషణముల్ నశియించునన్నియున్’ అని తెలుగులోకి అనువదించాడు. మనకు ‘వేషభాషలు’ అనే పదబంధం ఉంది. వేషం ఒక్కటే చాలదు, అందుకు తగిన భాష కూడా ఉన్నప్పుడే రాణిస్తుంది. దర్పానికి చిహ్నమైన భుజకీర్తులు, మెడలో ధగధగలాడే సువర్ణహారాలు, కేశపాశాలకు సొగసైన అలంకారాలు, శరీరాన్ని ఘుమఘుమలాడించే పన్నీటి స్నానాలు, ఒంటికి పూసుకునే మైపూతలు – ఇవేవీ మనిషికి అలంకారాలు కాలేవు. సంస్కారభరితమైన, సందర్భోచితమైన మృదువాక్కులే మనిషికి అసలైన ఆభరణాలు. భర్తృహరి సారాంశం ఇదే! అసమాన పదసంపద, అనర్గళ వక్తృత్వ ప్రాభవం, అన్నింటికీ మించి బహిరంగ వేదికలపై వాక్కుకు తగిన అభినయ చాతుర్యం వంటి ప్రతిభా పాటవాలెన్ని ఉన్నా, కించిత్ సందర్భశుద్ధి కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే వాగ్భూషణం మిలమిలలాడుతుంది. సమయ సందర్భాలను పట్టించుకోకుండా, నోటికొచ్చినట్లు మాట్లాడితే సభలలో రసాభాస తప్పదు. పద్మభూషణ పద్మవిభూష«ణాది సగౌరవ భూషణాలు ఎన్ని ఉన్నా, సందర్భశుద్ధి లేని వాచాలత ప్రదర్శించినట్లయితే, సదరు మనుషుల వాగ్భూషణం వెలవెలబోతుంది.అనవసర ప్రసంగాలు, అసందర్భ ప్రలాపాలు, పరుష పదప్రయోగాలు వాగ్భూషణానికి కిలుములా పట్టి, దానిని వెలవెలబోయేలా చేస్తాయి. వాగ్భూషణం వన్నె తరగకుండా ఉండాలంటే, ఎప్పుడు మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మౌనం పాటించాలో తెలుసుకోగల ఇంగితం కలిగి ఉండాలి. సూక్ష్మంగా ఈ లక్షణాన్ని వాగ్వివేకం అనవచ్చు. వాగ్వివేకం కలిగినవాళ్లు లోకంలో ఉత్తములుగా, ఉన్నతులుగా సముచిత గౌరవం పొందుతారు. ‘మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే సురక్షితం’ అన్నాడు గ్రీకు తత్త్వవేత్త ఎపిక్టీటస్. మనోభావాల శకంలో ఆయన సలహా పాటించదగినదే! ‘మౌనేన కలహం నాస్తి’ అని మన పూర్వ సుభాషితం కూడా చెబుతోంది. అయినా, మాట్లాడక తప్పని పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలుసుకోవడమే వాగ్వివేకం. ఇదే సంగతిని ‘అనర్గళ వాగ్ధార కన్నా మాట్లాడటంలో విచక్షణ ముఖ్యం’ అని ఇంగ్లిష్ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ ఏనాడో చెప్పాడు. ‘సకాలంలో పాటించే మౌనం వాగ్ధాటి కంటే గొప్పది’ అని ఇంగ్లిష్ కవి మార్టిన్ టప్పర్ అన్నాడు. విచక్షణ లోపించిన మాటలు మాట్లాడేవారు ఎంతటి ఘనసంపన్నులైనా సమాజం నుంచి గౌరవ మర్యాదలను సంపాదించుకోలేరు.వాగ్ధాటికి, వాచాలతకు ఉన్న విభజనరేఖను తెలుసుకుంటే చాలు– మాటలాడే కళలో రాణించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంత చిన్న సంగతి తెలుసుకోలేకపోవడం వల్లనే ప్రజాజీవితంలో ఉన్న నానా రంగాల ప్రముఖులు అనవసర ప్రసంగాలతో, అసందర్భ ప్రలాపాలతో అభాసుపాలవుతున్న సందర్భాలు ఇటీవలి కాలంలో తరచుగా తారసిల్లుతున్నాయి. ఇదొక పరిస్థితి అయితే, వాగ్దూషణా దురితచరితుల సంఖ్య కూడా సమాజంలో పెచ్చరిల్లుతోంది. ముఖ్యంగా రాజకీయ, వినోదరంగాల్లో వాక్కాలుష్యం దుర్భరంగా మారి, సామాన్యులకు మనశ్శాంతి లేకుండా చేస్తోంది. వాక్కాలుష్య ప్రభావం ఏ స్థాయిలో ఉందో ఇటీవల వస్తున్న సినిమాలు, టీవీ కార్యక్రమాలు, ఓటీటీ ప్రదర్శనలు చూస్తే, ఇట్టే అర్థమైపోతుంది.‘ఆది నుంచి ఆకాశం మూగది/ అనాదిగా తల్లి ధరణి మూగది/ నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు/ నడమంత్రపు మనుషులకే మాటలు/ ఇన్ని మాటలు’ అన్నారు వేటూరి. నడమంత్రపు సిరివర్గం, మిథ్యామేధావి వర్గంలోని మనుషుల వల్లనే సమాజంలో వాక్కాలుష్యం ప్రబలుతోంది. పర్యావరణంలోని నానా రకాల కాలుష్యాల నివారణ కోసం ప్రభుత్వాలు, అంతర్జాతీయ సంస్థలు తమ వంతు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. అయితే, వాక్కాలుష్య నివారణ చర్యలు తీసుకునే నాథులే కరవయ్యారు. వాక్కాలుష్య నివారణతోనే వాగ్భూషణానికి పునర్వైభవం సాధ్యం. -
టీడీపీ నేతల అమానుష చర్చ
-
ఇక ఉచితంగా మాట్లాడను!
కొందరు వ్యక్తులు తన సమయాన్ని అనవసరంగా వృథా చేస్తున్నారని, అలాంటి వ్యక్తులతో ఇక ఉచితంగా మాట్లాడననీ అంటున్నారు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్. అందుకే ఇకనుంచి ఎవరికైనా సమయం కేటాయించాలనుకుంటే అందుకు తగ్గట్టుగా ‘చార్జ్’ చేస్తానని అంటున్నారాయన. ఈ విషయంపై అనురాగ్ ఓ నోట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా, బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ‘‘కొంతమంది కొత్త వ్యక్తులకు సహాయం చేయాలనుకుని వారితో సమావేశమై నేను నా సమయాన్ని చాలా కోల్పోయాను. ఆ సమావేశాలు నాకు ఏ మాత్రం వర్కౌట్ కాలేదు కూడా. చెప్పాలంటే ఇలా చాలామందితో మాట్లాడి నేను అలసిపోయాను. ఈ విధంగా జీవితంలో చాలా సమయాన్ని కోల్పోయాను. సక్సెస్‌కు షార్ట్ కట్స్ వెతికేవారితో, తాము క్రియేటివ్ జీనియస్‌లా ఫీలయ్యే కొందరు వ్యక్తులతో ఇకపై నేను ఉచితంగా మాట్లాలనుకోవడం లేదు. నేను ఓ స్వచ్ఛంద సేవా సంస్థను కాదలచుకోలేదు. ఇకపై ఎవరైనా నన్ను కలవాలనుకుంటే పది నుంచి పదిహేను నిమిషాలు అయితే లక్ష రూపాయలు, 30 నిమిషాలకు రెండు లక్షలు, గంట అయితే ఐదు లక్షలు చెల్లించాలి. ఒకవేళ ఎవరైనా ఇలా డబ్బులు చెల్లించలేని పక్షంలో వారు నన్ను కలవడానికి ప్రయత్నించవద్దు’’ అని ఆ నోట్లో పేర్కొన్నారు అనురాగ్ కశ్యప్. ఇక బాలీవుడ్లో వచ్చిన ‘బ్లాక్ ఫ్రైడే’, ‘ముంబై కటింగ్’, ‘బాంబే టాకీస్’ వంటి సినిమాలకు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. -
మాట్లాడుతూ.. పదాలతో తడబడుతున్నారా!? అయితే ఇలా చేయండి!
మాటలు ధారాళంగా మాట్లాడటం, పలకడం మనుషులకున్న గొప్ప వరం. ఈ పుడమిలో మరే జీవానికి ఈ అవకాశం లేదు. ఒకవేళ అవి గొంతు చీల్చుకుని అరిచినా, పదాలను మాత్రం పలకలేవు. కానీ మనం మాత్రం పలుకగలం. ఈ క్రమంలో కొందరు మాట్లాడటంలో, అక్షరాలు పలకడంలో ఎంతగానో తడబడుతుంటారు. నాలుక తిరగని పదాలతో లోలోనే సంకోచిస్తూంటారు. ఇకపై ఈ చిన్న ట్రిక్ వాడారో, ఇలాంటి సమస్యల నుంచి దూరం అవ్వడానికి అవకాశం ఉంది. మరదేంటో చూద్దాం! మాటలు సరిగ్గా రానివారి కోసం.. వసకొమ్ముని దంచి చూర్ణం చేసుకుని ఆ చూర్ణాన్ని ఒక పాత్రలో పోసి ఆ చూర్ణం నిండేవరకు ఉసిరికాయల రసం పోసి బాగా కలిపి రాత్రంతా నానబెట్టి తరువాత ఎండబెట్టాలి. బాగా ఎండిన తరువాత మళ్లీ దంచి మెత్తగా తయారు చేసుకుని ఆ చూర్ణాన్ని రోజూ పూటకు మూడు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనె కలిపి రెండు పూటలా సేవిస్తూ ఉంటే మాటలు తడబడే వారికి, మాటలు ముద్దగా పలికేవారికి, ఆగి ఆగి మాట్లాడేవారికి ఆ సమస్యలు తొలగి మాటలు స్పష్టంగా వస్తాయి. • లేత మర్రి ఊడలు సాన పైన అరగదీసి ఆ గంధాన్ని నాలిక పైన రాస్తున్నా మాటలు త్వరగా వస్తాయి. క్షయరోగానికి.. క్షయ.. అదేనండీ.. టీబీతో ఇబ్బంది పడేవారు అశ్వగంధ పొడిని పాలల్లో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు బలం చేకూరటమే కాక శరీర రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నిద్రలేమి కూడా తగ్గుతుంది. గొంతులో కఫం.. వామాకు, తులసాకు, తమలపాకుని రోజూ తింటూ ఉంటే గొంతులో కఫం తగ్గిపోతుంది. మెత్తగా దంచి జల్లించిన కరక్కాయ పొడిని తేనెలో రంగరించి రెండు పూటలా చప్పరించినా గొంతులో గరగర, శ్లేష్మం పడటం వంటి సమస్యలు తొలగిపోతాయి. ఇవి చదవండి: బచ్చలికూర ఎంత మేలో.. తెలిస్తే అస్సలు వదులుకోరు! -
ఇన్‌స్టాలో మైనర్‌తో పరిచయం.. యువకుడిపై దాడి.. ట్విస్ట్ ఏంటంటే!
సాక్షి, బెంగళూరు: సోషల్ మీడియాలో పరిచయమైన 17 ఏళ్ల బాలికతో సన్నిహితంగా ఉంటున్నాడని ఓ యువుకుడిపై కొంతమంది యువకులు విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. బస్టాండ్‌లో మైనర్‌తో మాట్లాడుతుండగా గుంపుగా వచ్చిన యువకులు అతడ్ని కిడ్నాప్ చేసి దారుణంగా చితకబాదారు. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. సుబ్రమణ్యలోని కల్లుగుండకి చెందిన హఫీద్ అనే 20 ఏళ్ల యువకుడికి ఏడాది కిత్రం ఓ మైనర్ బాలికతో(17) ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. చాటింగ్ ప్రారంభించడంతో వీరి మధ్య స్నేహం ఏర్పడింది. తరుచూ బస్టాప్‌లో కలిసి మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో ఎప్పటిలాగే జనవరి 5వ తేదీన సుబ్రమణ్య బస్‌స్టాండ్‌లో యువకుడు అమ్మాయితో మాట్లాడుతుండగా అకస్మాత్తుగా వచ్చిన యువకుల గుంపు అతన్ని కిడ్నాప్ చేశారు. జీపులో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. యువకుడిపై మూకుమ్మడిగా దాడి చేశారు. బాలిక జోలికి రావొద్దని, మరోసారి ఆమోను చూడటం, మాట్లాడటం చేయవద్దని కత్తితో బెదిరించారు. ఈ ఘటనలో భాధితుడి తలకు బలమైన గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై స్పందించిన పోలీసులు ఈ ఘటనలో రెండు ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశారు. యువకుడిపై దాడి చేసినందకు 12 మందిపై కేసు నమోదు చేయడంతోపాటు.. బాధిత బాలుడిపై కూడా కేసు నమోదైంది. ఈ సంఘటన జరిగిన మరుసటి రోజు తన కూతురిని వేధింపులకు గురి చేశాడని బాలిక తండ్రి హఫీద్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. చదవండి: Crime News: దా.. బండెక్కు! అన్నాడు.. -
మాట మితం.. కరోనా ఖతం!
సాక్షి, హైదరాబాద్: మౌనం కరోనా నియంత్రణలో కీలకంగా పనిచేస్తుందని ప్రపంచ వ్యాప్తంగా జరిపిన తాజా పరిశోధనలు చెబుతున్నాయి. వీలున్నంత తక్కువ మాట్లాడడం వల్ల పాజిటివ్ వ్యక్తుల నుంచి ఇతరులకు ఈ వైరస్ వ్యాప్తిచెందే అవకాశం తక్కువని ’ద బీఎంజే’ తన జర్నల్‌లో ప్రచురించింది. అమెరికా, బ్రిటన్, చైనాలతోపాటు పలు దేశాల్లో జరిపిన పరిశోధనల్లో మౌనంగా ఉండడం, మాట్లాడడం, పాటలు పాడడం, గట్టిగా అరవడం వల్ల వైరస్ వ్యాప్తికి గల అవకాశాలను వివరించింది. ఈ జర్నల్ ప్రకారం.. ఇండోర్‌లో ఉండే పని ప్రదేశాలు, ప్రార్థనా మందిరాల్లో రిస్కే. ఎక్కువ వెంటిలేషన్ ఉంటే కొంత ప్రమాదం తగ్గుతుంది. ఇండోర్ ప్రదేశాల్లో, వెంటిలేషన్ సరిగా లేని దగ్గర ఎక్కువ సేపు ఉండి మాట్లాడుకోవడం, పాటలు పాడుకుంటూ, కేకలు వేయడం వైరస్ వ్యాప్తికి దోహదం చేస్తాయి. అమెరికాలో ఇటీవల జరిగిన ఓ సంగీత కచేరిలో పాల్గొన్నగాయకుడి ద్వారా 52 మందికి కరోనా వైరస్ సోకిందని తేలింది. తుంపర్లు 9 మీటర్ల వరకు గాలిలో ఎగిరి... పాజిటివ్ ఉన్న వ్యక్తులు తుమ్మినప్పు డు, దగ్గినప్పుడు మాత్రమే కాకుండా మాట్లాడినప్పుడు, ఇతర సందర్భాల్లో వచ్చే తుంపర్లు గరిష్టంగా 9 మీటర్ల వరకు వాటి పరిమాణం తగ్గకుండా గాల్లో ఎగిరి ప్రయాణిస్తాయి. ఆ తర్వాత వాటి సైజ్ తగ్గినా పెద్ద తుంపర్ల కంటే చిన్న తుంపర్ల ద్వారా వైరస్ ఎక్కువగా సోకుతుంది. ఏదో 2–3 మీటర్లు భౌతికదూరం పాటించినంత మాత్రాన సురక్షితం అనుకోవడం సరైంది కాదని, మిగిలిన జాగ్రత్తలు పాటించాలని ఈ జర్నల్ వెల్లడించింది. వివిధ పరిస్థితుల్లో వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలివి: ► వెంటిలేషన్ బాగా ఉన్న ప్రదేశంలో మాస్క్ ధరించి మాట్లాడకుండా ఎంతసేపు ఉన్నా వైరస్ వ్యాప్తి జరగదు. మాట్లాడినా ప్రమాదం లేదు. కానీ పాటలు పాడడం, కేకలు వేయడం వల్ల వ్యాప్తికి కొంత అవకాశం ఉంది. అదే జన సమ్మర్ధం ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో కొంచెం అధికం. ► వెంటిలేషన్ ఎక్కువగా ఉన్నా ఇండో ర్ అయితే, ముఖానికి మాస్క్ లేకపోతే, ఎక్కువ సేపు అక్కడే ఉంటే, మామూలుగా మాట్లాడితే వైరస్ సోకే అవకాశాలున్నాయి. ► ఇదే పరిస్థితుల్లో పాటలు పాడి, గట్టిగా అరిస్తే మాత్రం వైరస్ సోకే ప్రమాదం చాలా ఎక్కువ. ► ఫేస్ మాస్కులున్నా ఎక్కువమంది ఉన్న ప్రదేశాల్లో వెంటిలేషన్ సౌకర్యం సరిగా లేకపోతే మాటలు, పాటలు, అరుపులు వైరస్ వ్యాప్తికి కారణమవుతాయి. ► జన సమ్మర్థం ఎక్కువ ఉండి, ముఖానికి మాస్క్ లేకుండా చాలాసేపు ఉంటే మౌనంగా ఉన్నా వైరస్ సోకే అవకాశం కొంతమేర ఉంది. ► అందుకే వీలున్నంత తక్కువ మాట్లాడడం, మాస్కు ధరించడం, ఒకే ప్రదేశంలో ఎక్కువ సమయం గడపకపోవడం, వెంటిలేషన్ ఉన్న అవుట్ డోర్ ప్రదేశాలను ఎంచుకోవడం ద్వారా కరోనా మహమ్మారి మన దరి చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. -
మీడియాకు లీకేజీలపై బీసీసీఐ ఆగ్రహం
బీసీసీఐకి సంబంధించిన అంతర్గత సమాచారం మీడియాలో తరచుగా వస్తుండటం పట్ల బోర్డు కార్యదర్శి జై షా ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డు ఉద్యోగులెవరూ అనుమతి లేకుండా మీడియాతో మాట్లాడరాదని ఆయన ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే వారి కాంట్రాక్ట్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంతోపాటు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో కలిపి సుమారు 100 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ‘బీసీసీఐ ఉద్యోగులు కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఇంటర్వ్యూలు ఇస్తున్నారని తెలిసింది. ఇది కాంట్రాక్ట్ నిబంధనలకు విరుద్ధం. ఇలా చేయడం వల్ల బోర్డుకు సంబంధించి రహస్య సమాచారం కూడా బయటకు వెళ్లే అవకాశం ఉంది. ఉద్దేశపూర్వకంగా గానీ తమకు తెలీకుండా గానీ ఎవరైనా, ఏ రూపంలోనైనా ఇలా సమాచారం బయటకు చేరవేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. ఎలాంటి వేతన చెల్లింపులు కూడా లేకుండా ఉద్యోగంలోంచి తొలగిస్తాం’ అని ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్లో జై షా పేర్కొన్నారు. అయితే ఎలాంటి సమాచారం లీక్ కావద్దంటూ అంతర్గతంగా ఉద్యోగులకు పంపిన ఈ–మెయిల్ కూడా ఇప్పుడు మీడియాకు లీక్ కావడం విశేషం. -
బీజేపీలో చేరినా చంద్రబాబునాయుడికి వకాల్తా
-
ఐదు రోజులగా భారత దేశం మండిపోతుంది
-
కొన్ని గంటల్లో అమెరికా వెళ్లాల్సి ఉండగా..
బెంగళూరు(బనశంకరి): మొబైల్లో మాట్లాడుతూ ఐదవ అంతస్తుపై నుంచి కిందపడి ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన రాజరాజేశ్వరినగర పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం సాయంత్రం జరిగింది. రాజరాజేశ్వరి నగరలోని ఎస్వీ.రెసిడెన్సీ అపార్టుమెంటులో నవీన్‌కుమార్(21) అనే యువకుడు నివాసముంటున్నాడు. బుధవారం సాయంత్రం అపార్టుమెంటు ఐదవ అంతస్తుపై మొబైల్ లో మాట్లాడుతూ నవీన్‌కుమార్ ప్రమాదవశాత్తూ అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో అతను ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. సమాచారం అందిన వెంటనే రాజరాజే శ్వరినగర పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించిన అనంతరం కేసు నమోదు చేశారు. అనంతరం మృత దేహాన్ని శవపరీక్షల నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన యువకుడు బుధవారం రాత్రి ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లాల్సి ఉంది. అంతలోనే ఈ ఘటన జరిగింది. -
చంద్రబాబు ఎగతాళిగా మాట్లడుతున్నారు
-
సమగ్ర విచారణ జరపాలి: వైఎస్ఆర్సిపి
-
చిలుక పలుకులకు కారణం తెలిసింది..
వాషింగ్టన్: 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అని వేమన చెప్పిన మాదిరి పక్షుల్లో కూడా చిలుకలది ప్రత్యేక స్థానం. ఎందుకంటే మిగిలిన పక్షులకు వేటికీ లేనిదీ, చిలుకలకు మాత్రమే సొంతమైన సామర్థ్యం మాట్లాడగలగడం. వీటికి ఆ ప్రత్యేకత ఎందుకు వచ్చిందో వాషింగ్టన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో వెల్లడైంది. చిలుకల మెదడులో ఉండే ప్రత్యేకమైన అసమాంతర నిర్మాణాలే మనుషులు చేసే శబ్దాలను అవి అనుకరించడానికి కారణమని శాస్త్రవేత్తలు వెల్లడించారు. మిగిలిన పక్షుల్లో వేటికీ ఇలాంటి ప్రత్యేక నిర్మాణాలు లేవని తెలిపారు. వీటిపై గత 34 ఏళ్లుగా అధ్యయనాలు జరుగుతున్నా ఈ ప్రత్యేక నిర్మాణాలను ఇప్పటి వరకూ గుర్తించలేదని అన్నారు. విన్న శబ్దాలను అనుకరించడానికి సాయపడే ప్రత్యేకమైన కర్పరాలు కూడా చిలుకల్లో ఉన్నట్టు గుర్తించారు. హమ్మింగ్ బర్డ్ వంటి కొన్ని రకాల జాతుల పక్షుల్లోనూ ఇలాంటి కర్పరాలు ఉన్నా.. వాటి పరిమాణం చిలుకల్లో పెద్దగా ఉన్నట్టు నిర్ధారించారు. అందువల్లనే మానవులు చెప్పే మాటలను ముద్దు ముద్దుగా పలకడం వీటికి మాత్రమే సాధ్యమైందని వివరించారు. అయితే వీటి మెదడులో ఇలాంటి ప్రత్యేక నిర్మాణాలు వీటి జాతి ఆవిర్భవించినప్పటి నుంచీ ఉన్నాయా.. లేక కాలక్రమేణా ఉద్భవించాయా.. అనే కోణంలో కూడా శాస్త్రవేత్తలు పరిశోధించారు. వీటికి ఈ ప్రత్యేకతలు కొన్ని కోట్ల సంవత్సరాల ముందు నుంచే ఉన్నాయని ధ్రువీకరించారు. -
తిరుమలలో మూగకు మాటలు
-
తిరుమలలో అద్బుతం....మూగకు మాటలు
తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడి సన్నిధిలో శనివారం అద్భుతం జరిగింది. పుట్టు మూగకు మాటలు వచ్చాయి. లండన్‌కు చెందిన ఓ ఎన్నారై కుటుంబం ఈరోజు ఉదయం తన కుమారుడితో కలిసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకుని ఆలయ వెలుపలకు వచ్చిన మూడు నిమిషాల తర్వాత వకుళమాత ఆలయంతో తీర్థం తీసుకున్న అనంతరం దీపక్ (18) నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా వినిపించింది. అయితే ఇందులో వింతేమీ ఉందనుకుంటున్నారా? వివరాల్లోకి వెళితే....లండన్‌కు చెందిన దీపక్ పుట్టకతోనే మూగవాడు. మాటలు వచ్చేందుకు అతడిని తల్లిదండ్రులు ఎంతోమంది వైద్యుల దగ్గరకు తీసుకు వెళ్లారు. అయినా ఫలితం లేకపోయింది. అయితే నాలుగేళ్లుగా దీపక్‌కు లండన్‌లోనే స్పీచ్ థెరఫీ ఇప్పిస్తున్నారు. అయినా అతనికి మాటలు రాలేదు. కేవలం పెదాల కదలికలు మాత్రమే ఉండేది, మాటలు మాత్రం బయటకు వచ్చేవి కావు. కాగా చాలా ఏళ్ల క్రితం నాటి స్వామివారి మొక్కు చెల్లించుకునేందుకు ఆ కుటుంబం ఈరోజు తిరుమల వచ్చింది. స్వామివారి దర్శనం అనంతరం తమ బిడ్డ నోటి నుంచి అమ్మా అనే పదం స్పష్టంగా రావటంతో తల్లిదండ్రులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అంతా వెంకన్న మహిమేనని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి ఆశీస్సుల వల్లే తమ బిడ్డ మాట్లాడుతున్నాడని వారు తెలిపారు. అయితే నేటి ఆధునిక యుగంలో ఇటువంటి ఘటనలు జరగటం యాదృచ్ఛికమో... దైవలీలో తెలియదు కానీ దీపక్ తల్లిదండ్రులు ఆనందానికి హద్దు లేకుండా ఉంది. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ఆలయ అధికారులు వెంటనే దీపక్ కుటుంబ సభ్యులను కలుసుకుని అభినందించారు. వారికి స్వామివారి ప్రసాదాలను అందించారు.ఇదో అద్బుతం అని,ఇలాంటివి తెలిక మరెన్నో అద్భుతాలు జరుతున్నాయని అందుకే తిరుమల శ్రీనివాసుని దర్శించుకోటానికి రోజురోజుకు భక్తులు పెరుగుతున్నారని ఆలయ అధికారి చిన్నంగారి రమణ అన్నారు. స్వామివారిని మనసారా వేడుకుంటే కోర్కెలు తప్పకుండా తీరుస్తారని ఆయన వ్యాఖ్యానించారు. -
మీ స్నేహితుడు చనిపోయాడా?!
స్వప్నలిపి ఏ అర్ధరాత్రో, తెల్లవారుజామునో దిగ్గుమని మెలకువ వస్తుంది. పాడు కలను ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటారు... కలలో...మీ ఫ్రెండ్‌కు యాక్సిడెంట్ జరిగి చనిపోతాడు! ‘ఫ్రెండ్‌ను గుండెలో పెట్టుకొని ప్రేమించే నాకు ఇలాంటి కల రావడం ఏమిటి?’ అని ఆశ్చర్యపోతారు. ఆ కలను అసహ్యించుకుంటారు. స్నేహితుడికే కాదు... ఆ కలను ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. ‘‘నీకు తప్ప ఇలాంటి కలలు ఎవరికి వస్తాయి!’’ అని వెక్కిరిస్తారేమోనని భయం. అలాంటి కలలకు అర్థం ఇది మనం ఎవరినైనా బాగా ప్రేమిస్తున్నప్పుడు, అభిమానిస్తున్నప్పుడు...వారి బాగోగులు, యోగక్షేమాల గురించి చాలా ఎక్కువ శ్రద్ధ పెడతాం. ఉదాహరణకు... ‘వెళ్లొస్తాను’ అని స్నేహితుడు టాటా చెప్పి బైక్ మీద బయలుదేరే సమయంలో ‘జాగ్రత్తగా వెళ్లు’ అంటాం. ఇక మన మనసు మహల్లో ఈ ‘జాగ్రత్త’ రకరకాల రూపాలు ధరిస్తుంది. అనేకానేక ప్రశ్నలు పుట్టగొడుగుల్లా పుడుతుంటాయి. ‘జాగ్రత్తగానే వెళ్లాడా?’ ‘మొన్న ఒక రోడ్డు యాక్సిడెంట్‌ను కళ్లారా చూశాను. వీడికి అలా కాలేదు కదా?’ ‘డ్రైవింగ్ చేస్తూ ఏదో ఆలోచిస్తుంటాడు. ఎన్నో సార్లు చెప్పాను, అలా ఆలోచించవద్దని. జాగ్రత్తగానే వెళ్లి ఉంటాడా?’ ‘వేగంగా డ్రైవ్ చేయవద్దని వెయ్యిసార్లు చెప్పి ఉంటాను. ఇప్పుడు కూడా అలానే వెళ్లి ఉంటాడా?...’ ఇలా రకరకాల జాగ్రత్తలన్నీ కలిసి ఒక రూపాన్ని తీసుకుంటాయి. అవే కలలుగా మారుతాయి. అంతకు మించి ఇలాంటి కలల గురించి భయపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. -
మీడియాతో వట్టి వసంత్‌కుమార్