రాష్ట్రానికి కేంద్ర బృందాలు | The central groups | Sakshi
Sakshi News home page

రాష్ట్రానికి కేంద్ర బృందాలు

Published Mon, Sep 23 2013 4:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

The central groups

సాక్షి, బెంగళూరు :  అధిక వర్షాల వల్ల రాష్ట్రంలో ఈ ఏడాది చోటుచేసుకున్న పంటనష్టాన్ని అధ్యయనం చేయడానికి  సోమవారం రెండు కేంద్ర బృందాలు రాష్ట్రానికి రానున్నాయి. మూడు రోజుల పాటు ఏడు జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో ఈ బృందాలు వేర్వేరుగా పర్యటించనున్నాయి. ఆయా జిల్లాలకు చెందిన పరిపాలన, వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ శాఖలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు కేంద్ర బృంద సభ్యులతో పాటు క్షేత్రస్థాయి అధ్యయనంలో పాల్గొననున్నారు.

రాష్ట్రంలో పర్యటించనున్న ఓ బృందానికి కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రెటరీ ఆర్.కే శ్రీవాస్తవ నేతృత్వం వహించనున్నారు. ఆయతో పాటు ఈ బృందంలో ఇతర సభ్యులుగా ఉన్న సంజయ్‌గార్గ్, మురళీధరన్, మనోహరన్‌లు దక్షిణ కన్నడ, ఉడిపి, కొడగు జిల్లాల్లో పర్యటించి భారీ వర్షాల వల్ల కలిగిన పంట నష్టాన్ని అధ్యయం చేయనున్నారు. అదే విధంగా వరదల వల్ల ఇళ్లు కోల్పోవడం వల్ల కలిగిన ప్రాణ, ఆస్తి నష్టాన్ని కూడా వీరు అంచనా వేయనున్నారు. పర్యటనలో భాగంగా మొదటిరోజైన సోమవారం ఉడిపి, కుందాపుర, కార్కళలో క్షేత్రస్థాయి పర్యటన జరపనున్నారు.

24న బండ్వాళ, సుబ్రహ్మణ్య, సుళ్య, పుత్తూరు, మంగళూరులో, 25న మడికేరి, పొన్నంపేట, సోమవారపేట, కుశాలనగర, విరాజ్‌పేటలో పర్యటించి వాస్తవ పరిస్థితులను అధ్యయం చేయనున్నారు. ముగ్గురు సభ్యులు గల మరో బృందానికి సీడబ్ల్యూసీ చీఫ్ ఇంజనీర్ కే.ఎస్ జాకోబ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ బృందంలో జాకోబ్‌తో పాటు వివేక్ గోయల్, టీ.జీ.ఎస్ రావ్ ఉన్నారు. వీరు బెల్గాం, ఉత్తరకన్నడ, శివమొగ్గ, చిక్కమగళూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. క్షేత్రస్థాయి అధ్యయనంలో భాగంగా వీరు మొదటిరోజు కానాపుర, సదలగ, అంగళి, 24న కారవార, జోయిడా, అంకోల, శిరిసి, సిద్ధాపురగ్రామాల్లో, 25న సాగర, హోసనగర, తరికెరే, బీరూరు, చిక్కమగళూరుకు చెందిన పంటపొలాలను సందర్శించనున్నారు.

అనంతరం రెండు బృందాలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలుసుకుని సమీక్ష సమావేశం జరపనున్నారు. అనంతరం ఈ బృందాలు ఢిల్లీకి వెళ్లి నివేదికను ఇవ్వనున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్రంలో అధిక వర్షాల వల్ల ఏర్పడిన నష్టం వల్ల రాష్ట్రంలో రూ.2,450 కోట్ల పంట, ఆస్తి నష్టం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం నివేదికను రూపొందించింది. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందించి సాయం కోసం వేచిచూస్తోంది.  
 
 కాకుండానే గోడలు బీటలు వారటం, చిన్నచిన్న వర్షాలకే పైకప్పు నుంచి ఇళ్లలోకి నీరు చేరడం జరుగుతోంది. మరోవైపు విద్యుత్, నీటిసరఫరా మురుగునీటి కాలువలు తదితర మౌలికసదుపాయాలు కూడా కొన్ని చోట్ల ఇప్పటికీ ప్రభుత్వం కల్పించకపోవడంతో లబ్ధిదారులు ఆసరా ఇళ్లలో చేరడానికి లబ్ధిదారులు ఆసక్తి చూలేకపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికై మెల్కొని మౌలికసదుపాయాలు కల్పిస్తేలబ్ధిదారులకు ప్రయోజనం చేకూరడమే కాకుండా ప్రభుత్వం ఖర్చుపెట్టిన వేలాది కోట్లు వృథా కాకుండా పోతాయని రెవెన్యూశాఖ అధికారులు వాఖ్యానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement