ఒక్కటిగా ముందుకు సాగాలి
Published Sat, Sep 14 2013 12:17 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
సాక్షి, న్యూఢిల్లీ: సమస్యల పరిష్కారం కోసం రైతులంతా పార్టీలకు అతీతంగా ఏకం కావాలంటూ భారతీయ కిసాన్‌సంఘ్ అఖిల భారత అధ్యక్షుడు రామచంద్ర ముర్కుటేపిలుపునిచ్చారు. భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో నిర్వహించిన కిసాన్ అధికార్ ర్యాలీలో లక్షలాదిమంది రైతులు వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లా ల నుంచి దాదాపు 1,500 మంది రైతులు పాల్గొన్నారు. వీరిలో వంద మంది వరకు మహిళా రైతులుకూడా ఉన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యవసాయ వ్యతిరేక విధానాలపై అవగాహన కల్పిం చేందకు గ్రామగ్రామాన పోరాటాలు చేయాలని పేర్కొన్నారు.
డిమాండ్లు సాధించుకునే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశా రు. రైతుల సమస్యలపై స్పందించని ప్రభుత్వాలను గద్దె దించే వరకు తమ ఉద్యమించాలని అన్నారు. ఆహార భద్రత బిల్లుతో ప్రపంచ దేశాల మధ్య భారతదేశాన్ని తిండికొరత ఉన్న దేశంగా అప్రతిష్టపాలు చేశారని ఆరోపించారు. ధర్నాలో పాల్గొన్న భారత కిసాన్ సంఘ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్యాద అంజిరెడ్డి మాట్లాడుతూ..వ్యవసాయ ఉత్పత్తులన్నింటిని లాభసాటి ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాల ని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలన్నారు. నీరు, విత్తన ప్రైవేటీకరణకోసం పార్లమెం టులో ప్రవేశపెట్టిన బిల్లు వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు.
నీరు, విత్తనాలపై రైతాంగానికే సంపూర్ణ అధికారం ఉండాలన్నారు. భూసేకరణ చట్టాన్ని పేరు మార్చి భూవినియోగ చట్టంగా చేయాలన్నా రు. వ్యవసాయ భూములపై రైతులకే హక్కులు ఉండేవిధంగా చట్టం తీసుకురావాలన్నారు. వ్యవసాయ భూములు ఇతర అవసరాలకు వాడితే రైతులకు రాయల్టీ చెల్లించాలని డిమాండ్ చేశారు. భూమిలోని అన్ని ఖనిజాలపై రైతులకు హక్కులు కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గడకొట్టు రాంబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల వ్యవసాయ విత్తన ఉత్పత్తి బహుళ జాతీయ కంపెనీల హస్తగతమైం దని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పోరాడని రాజకీయ పార్టీలకు వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ఆయన హెచ్చరించారు.
ఈ ధర్నాలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్లపు సూర్యనారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యుడు కె.సాయిరెడ్డి,రాష్ట్ర కార్యదర్శి ఎం.శ్రీధర్‌రెడ్డి,కుమారస్వామి, సురేందర్‌రెడ్డితోపాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement