సాక్షి, న్యూఢిల్లీ: ఉబర్ కంపెనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని, చీటింగ్, నేరపూర్వక నిర్లక్ష్యం, నేరానికి ప్రోత్సాహం ఆరోపణలపై కంపెనీపై కేసు నమోదు చేయనున్నట్లు పోలీసుఅధికారులు తెలిపారు. ఉబర్ ట్యాక్సీలో మహిళపై డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడిన కేసులో ఢిల్లీ పోలీసులు ఉబర్ ట్యాక్సీ సర్వీస్‌పై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ బి.ఎస్. బస్సీ
తెలిపారు. కంపెనీపై చట్టప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చనే దానిపై పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పారు. నగరంలో మహిళపై లైంగికదాడికి పాల్పడిన ట్యాక్సీ డ్రైవర్ శివకుమార్ యాదవ్‌పై ఫోర్జరీ కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు కమిషనర్ తెలిపారు. వ్యక్తిత్వ, నడవడిక వికాస ధ్రువీకరణ పత్రం ఫోర్జరీ చేసినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. టాక్సీ డ్రెవర్ ఉబర్ కంపెనీకి నకిలీ ధ్రువీకరణ పత్రం అందజేసినట్లు బస్సీ తెలిపారు. ఆ పత్రంపై సంతకం చేసిన ఢిల్లీ పోలీసు అధికారి ఆ రోజున విధుల్లో లేనట్లు దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు. క్యాబ్ సర్వీస్‌ల వద్ద కాంట్రాక్టుపై పని చేసే డ్రైవర్ల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ఆదే శించినట్లు ఆయన చెప్పారు. మహిళపై లైంగికదాడి కేసులో 20 రోజులలో చార్జీషీటు సమర్పించనున్నట్లు పోలీసులు తెలిపారు. టాక్సీ డ్రై వరు శివకుమార్ యాదవ్‌పై ఉత్తరప్రదేశ్‌లోనూ పలు క్రిమినల్ కేసులున్నట్లు తెలిసింది. 2013లోనూ యూపీలో లైంగికదాడి, దోపిడీ కేసు నమోదైందని, ఈ కేసులో నుంచి నిందితుడు బెయిలుపై బైటకు వచ్చాడని చెప్పారు.
‘ఉబర్’పై ఐపీసీ 420, 34, 188 కింద కేసులు నమోదు చేసినట్లు నార్త్ డీసీపీ మధుర్ వర్మ తెలిపారు. అనుభవజ్ఞులైన డ్రెవర్‌తో సురక్షితమైన ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నామని కంపెనీ ప్రయాణికులను మోసగిస్తున్నట్లు దర్యాప్తులో తేలినట్లు ఆయన చెప్పారు. రవాణా నియమాలను ఉల్లంఘించిన కంపెనీపై మోటారు వాహన చట్టం కింద కేసు నమోదుచేశారు. కంపెనీ విధానాలను రూపొందించిన అధికారులు అమెరికాలో ఉన్నందువల్ల అక్కడి అజ్ఞాత వ్యక్తులపై కేసు నమోదుచేసినట్లు చెప్పారు.
లెసైన్స్‌లేని ట్యాక్సీల పరిశీలన
ఢిల్లీలో 6 రేడియో ట్యాక్సీ సేవలు మాత్రమే లెసైన్స్ కలిగి ఉన్నాయి, మిగతావన్నీ లెసైన్స్ లేని ట్యాక్సీలుగా గుర్తించినట్లు ఢిల్లీ ప్రభుత్వ రవాణా అథారిటీ పేర్కొంది. ఈ మేరకు లెసైన్స్ కలిగిన రేడియో టాక్సీ సేవల మినహా మిగతా రేడియో టాక్సీ సేవలన్నింటిపై రవాణా విభాగం నిషేధం విధించింది.
లెసైన్స్ ఉన్నవి ఇవే..
ఈజీ క్యాబ్స్, మోగా క్యాబ్, మేరు క్యాబ్, చాన్సన్ క్యాబ్, యో క్యాబ్, ఎయిర్ క్యాబ్ మాత్రమే ఢిల్లీలో లెసైన్స్ కలిగిన రేడియో టాక్సీ సేవలని రవాణా అథారిటీ పేర్కొంది. లెసైన్స్ కలిగిన రేడియో టాక్సీ సేవలు మినహా వెబ్ ధారిత టెక్నాలజీ ద్వారా సేవలందించే మిగతా టాక్సీ సర్వీస్‌లన్నింటిపై నిషేధం విధిస్తున్నట్లు రవాణా అథారిటీ ప్రకటన జారీచేసింది. రవాణా విభాగం నుంచి లెసైన్స్ పొందేవరకు ఈ నిషేధం వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొంది.
లెసైన్స్ లేకుండా..
ఉబర్‌తో సహా ఓలా, టాక్సీ ఫర్ ష్యూర్ వంటి ప్రముఖ కంపెనీలు లెసైన్స్ లైకుండా సేవలు అందిస్తున్నాయి. లెసైన్స్ లేకుండా మిగీతా రేడియో ట్యాక్సీ కంపెనీల వివరాలు తమ వద్ద లేదని రవాణా శాఖ స్పెషల్ కమిషనర కె.ఎస్. గంగార్ చెప్పారు. రిజిస్టర్ చేయించని ఇంటర్నెట్ ఆధారిత కారు బుకింగ్ సేవలన్నింటిపై నిషేధం విధించాలని హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించింది.
ఉబర్ కంపెనీపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Published Wed, Dec 10 2014 12:25 AM | Last Updated on Fri, Oct 5 2018 9:09 PM
Advertisement