జయ రాజీనామా చేయాలి | Vaiko demands Chief Minister's resignation | Sakshi
Sakshi News home page

జయ రాజీనామా చేయాలి

Published Mon, Dec 28 2015 2:19 AM | Last Updated on Tue, Aug 14 2018 2:24 PM

Vaiko demands Chief Minister's resignation

టీనగర్:
రాష్ట్రంలో ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిందని, అందువల్ల ముఖ్యమంత్రి జయలలిత పదవికి రాజీనామా చేయాలని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో డిమాండ్ చేశారు. అరియలూరులో ఏర్పాటుచేసిన సమావేశంలో వైగో మాట్లాడుతూ చెన్నై వరదలకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని దీంతో అధిక నష్టం ఏర్పడిందన్నారు. అందువల్ల జయ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. రాష్ట్రంలో 65 శాతం మంది ప్రజలు ఏ పార్టీకి చెందని వారుగా ఉన్నారని, వీరంతా మక్కల్ నలకూట్టనికి మద్దతుగా నిలుస్తారన్న నమ్మకంతో వున్నట్లు తెలిపారు. ప్రధాని మోడీ పాకిస్తాన్ పర్యటన స్వాగతించాల్సిన విషయం అన్నారు. దీనిని రాజకీయం చేయడానికి ఇష్టపడడం లేదన్నారు. తమ పార్టీ అనేక డిమాండ్ల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును ఖండిస్తూ చెన్నైలో ఈ నెల 31వ తేదీన ఆందోళన జరపనున్నామని, జనవరి 22,23,24 తేదీల్లో మక్కల్ నలకూట్టనికి చెందిన నలుగురు పార్టీల నేతలతో ప్రచారం సాగిస్తామన్నారు. 27న మక్కల్ నలకూట్టని కార్యాచరణ పథకాన్ని వివరిస్తూ మహానాడును మదుైరె లో జరుపనున్నట్లు తెలిపారు.

స్తంభించిన పాలన: ఈవీకేఎస్ ఇళంగోవన్
వరదల్లో చిక్కుకుని ప్రజలు అవస్థలు పడుతున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సరిగా పనిచేయలేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఎస్ ఇళంగోవన్ విమర్శించారు. విల్లుపురం జిల్లా, కన్నదాసన్ సేవా సంఘం ధ్వర్యంలో కవి కన్నదాసన్ 13వ వార్షికోత్సవం శనివారం జరిగింది. మనసులో తోచిన విషయాన్ని యథార్థంగా మాట్లాడేవారిలో తందై పెరియార్, తన తండ్రి సంపత్, కన్నదాసన్ ఉన్నారని అన్నారు. ఇటీవల వరదల్లో వేలాది మంది మృతిచెందారని, అనేక మంది నిరాశ్రయులయ్యారని అన్నారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేయకుండా నిర్జీవ స్థితిలో ఉండిపోయిందని విమర్శించారు. వచ్చే ఏడాది కన్నదాసన్ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకుంటామని, ఆ సమయంలో అన్నాడీఎంకే ప్రభుత్వం ఉండదని, వేరొక మంచి పాలన వస్తుందని జోస్యం చెప్పారు.

అన్నాడీఎంకే కథ ముగుస్తుంది: రాందాస్
ఆస్తులు కూడబెట్టిన కేసులో తీర్పు వచ్చిన సమయంలో అన్నాడీఎంకే కథ ముగుస్తుందని పీఎంకే వ్యవస్థాపకులు డాక్టర్ రాందాస్ తెలిపారు. తూత్తుకుడిలో వరద బాధిత ప్రాంతాలు రహమత్ నగర్, ముత్తమ్మాల్ కాల నీలను రాందాస్ సందర్శించారు. ఆయన మాట్లాడు తూ వరద బాధితులను అధికార పార్టీ, రాష్ట్ర అధికారు లు ఆదుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. త్వరలో అన్నాడీఎంకే కథ ముగుస్తుందని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement