రేపు తళి నియోజక వర్గంలో వెంకయ్యనాయుడు ప్రచారం | Venkaiah Naidu tali constituency campaign tomorrow | Sakshi
Sakshi News home page

రేపు తళి నియోజక వర్గంలో వెంకయ్యనాయుడు ప్రచారం

Published Fri, Apr 29 2016 4:30 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Venkaiah Naidu tali constituency campaign tomorrow

డెంకణీకోట :  తళి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బి.రామచంద్రన్‌ను బలపరుస్తూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు డెంకణీకోటలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తళి నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి బి.రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఆయన హెలిక్యాప్టర్‌లో వచ్చి డెంకణీకోటలో దిగి 30వ తేదీ ఉదయం డెంకణీకోటలో జరిగే బహిరంగ సభలో మాట్లాడుతారని తెలిపారు. తళి నియోజకవర్గంలో తెలుగువారు ఎక్కువగా ఉన్నందు వల్ల వారి ఓటర్లను ఆకట్టుకోవటానికి బీజేపీ చేపట్టిన ప్రయత్నంలో భాగంగా వెంకయ్యనాయుడు ప్రచారం ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement