యరపతినేనికి పిన్నెల్లి మరోసారి సవాల్ | ysrcp mla pinnelli once again challenges to tdp mla yarapathineni | Sakshi
Sakshi News home page

యరపతినేనికి పిన్నెల్లి మరోసారి సవాల్

Published Mon, Aug 29 2016 2:21 PM | Last Updated on Tue, Oct 30 2018 4:51 PM

యరపతినేనికి పిన్నెల్లి మరోసారి సవాల్ - Sakshi

యరపతినేనికి పిన్నెల్లి మరోసారి సవాల్

గుంటూరు : టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరోసారి సవాల్ విసిరారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఇద్దరం రాజీనామా చేద్దామన్నారు. దమ్ముంటే యరపతినేని తన సవాల్ను స్వీకరించాలని ఆయన పేర్కొన్నారు.
 
మాచర్లలో పిన్నెల్లి  మీడియాతో మాట్లాడారు. కృష్ణా పుష్కరాల పనుల్లో యరపతినేని ముమ్మాటికీ అవినీతికి పాల్పడ్డారన్నారు. ఆధారాలతో సహా నిరూపిస్తానంటే..తనను హౌస్ అరెస్ట్ చేయించారని ఆయన ఆరోపించారు. గురజాలలో యరపతినేనిపై తాను పోటీ చేస్తానని...ఎవరు ఓడిపోతే వాళ్లు రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని పిన్నెల్లి చెప్పారు. యరపతినేని మైనింగ్లో అవినీతికి పాల్పడ్డారని లోకాయుక్త కూడా నిర్ధారించిందన్నారు.    
 
ఎమ్మెల్యే పిన్నెల్లి సోమవారం దాచేపల్లిలో జరిగే చర్చావేదికకు వెళ్లడానికి సిద్ధమవుతుండగా ఎమ్మెల్యేలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పల్నాడు పరిధిలోని మాచర్ల, గురజాల, దాచేపల్లిలో ఆదివారం రాత్రి నుంచి 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement