ఐ ఫోన్‌ 7, 7 ప్లస్‌లపై ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ | iPhone 7, iPhone 7 Plus Red 128GB Variant Available With Flat Discount on Amazon India | Sakshi
Sakshi News home page

ఐ ఫోన్‌ 7, 7 ప్లస్‌లపై ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

Published Fri, Apr 14 2017 3:19 PM | Last Updated on Thu, Oct 4 2018 4:27 PM

ఐ ఫోన్‌ 7, 7 ప్లస్‌లపై ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ - Sakshi

ఐ ఫోన్‌ 7, 7 ప్లస్‌లపై ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌

న్యూఢిల్లీ: ఇ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ ఆపిల్‌ ఐ ఫోన్లపై డిస్కౌంట్‌  ధరలను ఆఫర్‌ చేస్తోంది.  ఆపిల్‌  తాజా స్మార్ట్‌ఫోన్లు ఐ ఫోన్‌ 7 రెడ్‌,  7 ప్లస్‌ రెడ్‌ పై రూ. 4000 తగ్గింపు అందిస్తోంది.  మొదటి రోజు అమ్మకాలపై మాత్రమే ఈ తగ్గింపు ధరలు వర్తిస్తాయని అమెజాన్‌ ప్రకటించింది.  

గత నెలలో రెడ్‌ కలర్‌ స్పెషల్‌  వేరియింట్‌ లో ఈ ఐ ఫోన్‌ 7, 7 ప్లస్‌  మోడల్స్‌ను ఆపిల్‌ లాంచ్‌ చేసింది. అలాగే  ఇండియాలో ప్రీ బుకింగ్‌ లను గత వారం మొదలు పెట్టింది.  ప్రస్తుతం వీటిపై  అమెజాన్‌ ఈ స్పెషల్‌ డిస్కౌంట్‌ అందిస్తోంది.

ఐ ఫోన్‌ 7 రూ. 66000 కే అమెజాన్‌ అందిస్తోంది.  దీని లాంచింగ్‌ ధర  రూ.70,000
ప్రస్తుతం ఐ ఫోన్‌ 7 ప్లస్‌  ధర రూ. 78,000గా ఉంది. దీని లాంచింగ్‌ ధర  రూ. 82, 000

మరోవైపు 128 జీబీ వేరియంట్‌ ఐ ఫోన్లపై మాత్రమే ఈ ఫ్లాట్‌ డిస్కౌంట్‌ లభ్యం. అలాగే  రూ. 8550 ల దాకా ఎక్సేంజ్‌ ఆఫర్‌ కూడా ప్రకటించింది. ఎక్సేంజ్‌ చేసుకునే  డివైస్‌ ఆధారంగా డిస్కౌంట్‌ ధరను నిర్ణయిస్తారు.  

కాగా  ఏప్రిల్‌ 14నుంచి  ఆపిల్‌ ఐ ఫోన్‌ 7,7 ప్లస్‌ విక్రయించనున్నట్టు  ఆపిల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఐ ఫోన్‌ 7 256 జీబీ వేరియంట్‌ను  అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధర. 80,000గా నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement