జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు 1147
అత్యధికంగా ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ల కొరత సోషల్, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్ సబ్జెక్టులకు టీచర్లు కరువు అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లు లేదా.. పోస్టుల అప్‌గ్రేడ్ ద్వారా భర్తీ డెరైక్టరేట్‌కు ప్రతిపాదనలు పంపిన జిల్లా విద్యాశాఖ
నల్లగొండ : ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధన ఆగమ్యగోచరంగా మారింది. విద్యాసంవత్సరం ఆరంభ మైన మూడు నెలల కాలంలో ఇప్పటికే 20 శాతం సిలబస్ పూర్తికావాల్సి ఉంది. కానీ బదిలీలు, పదోన్నతుల కారణాలతో జూలైలో బోధించాల్సిన సిలబస్ ఇంకా పూర్తికాలేదు. ఈ నెలాఖరులోగా ఆగస్టు సిలబస్ కూడా పూర్తిచేసి రెండో యూనిట్ పరీక్షలకు సిద్ధం కావాలి. కానీ బదిలీల కౌన్సెలింగ్ తర్వాత ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకుండా పోయా రు.
ప్రస్తుతం అమలవుతున్న విద్యావిధానాల ప్రకారం విద్యార్థులు చదువులో వెనకబడకుండా..వారిలో ప్రమాణాలు మెరుగపర్చేవిధంగా సమగ్ర మూల్యాం కనం నిర్వహించాలి. కానీ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా సమగ్ర మూల్యాంకనానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. అక్టోబర్‌లో జరిగే ఎస్-1 పరీక్షల నాటికి విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో బోధన జరగాల్సి ఉన్నప్పటికి సాంఘిక శాస్త్రం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేకపోవడంతో ఆ పాఠ్యాంశాలను బోధించేవారే లేకుండా పోయారు.
పరిస్థితి ఇదీ...
బదిలీలు, పదోన్నతుల తర్వాత జిల్లాలో వివిధ కేటగిరీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను విద్యాశాఖ గుర్తించింది. స్కూల్ అసిస్టెంట్ కేటగిరీలో జిల్లాకు 4,511 పోస్టులు మంజూరయ్యాయి. దీంట్లో ప్రస్తుతం 4,252 మంది ఉపాధ్యాయులు ప నిచేస్తున్నారు. రేషనలైజేషన్ ప్రకారం విద్యార్థులకు సంఖ్యకు అనుగుణంగా 4,811 పోస్టులను సర్దుబాటు చేశారు. ఇంగ్లిష్, గణితంలో విద్యార్థుల సంఖ్యకు మించి పోస్టుల మిగలడంతో వాటిని డీఈఓ పూల్‌లో ఉంచారు. ఇదే పద్ధతిలో మిగిలిన కేటగిరీల్లో కూడా పోస్టులు సర్దుబాటు చేయగా ఇంకా 1147 పోస్టులు కొరత ఉన్నట్లు విద్యాశాఖ లెక్కతేల్చింది. వీటిల్లో అత్యధికంగా స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు 507 కాగా...వ్యాయామ ఉపాధ్యాయులు, లాంగ్వేజి పండిట్లు పోస్టులు 551 ఖాళీలు ఉన్నాయి.
జిల్లాలో బదిలీల తర్వాత ఏర్పడిన పోస్టుల ఖాళీల వివరాలు
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు= 5
స్కూల్ అసిస్టెంట్లు= 507
లాంగ్వేజి పండిట్లు= 316
పీఈటీ= 235
ఎస్‌జీటీ= 20
ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎం= 64
చదువులు సాగేదెట్లా?
Published Tue, Aug 11 2015 1:03 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement