మండలంలోని వాడపల్లి చెక్ పోస్టు వద్ద 18క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్‌ఐ రామన్ గౌడ్ తెలిపారు.
దామరచర్ల (మిర్యాలగూడ): మండలంలోని వాడపల్లి చెక్ పోస్టు వద్ద 18క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నట్లు ఎస్‌ఐ రామన్ గౌడ్ తెలిపారు. బుధవారం మండంలోని కొండ్రపోల్ నుంచి ఏపీలోని దాచేపల్లికి బియ్యాన్ని తరలిసుతండగా విశ్వసనీయ సమచారం మేరకు మాటు వేసి బియ్యాన్ని పట్టుకుని పోలీసు స్టేషన్‌కు తరలించామన్నారు. సంఘటతో సంబంధం ఉన్న దాచేపల్లికి చెందిన డ్రైవర్ కొప్పుల అప్పారావు, బొమ్మిరెడ్డి అంకారావు, బొమ్మిరెడ్డి నాగరాజు, కొండ్రపోల్‌కు చెందిన అచ్చిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.