ఆదిలాబాద్(మందమర్రి): సింగరేణి కార్మికోద్యమంలో తమదైన ముద్ర వేసుకున్న పీపుల్స్ వార్ అనుబంధ కార్మిక సంఘం సింగరేణి కార్మిక సమాఖ్య(సికాసా) నేత మాదిరెడ్డి సమ్మిరెడ్డి అలియాస్ రమాకాంత్ ఎన్‌కౌంటర్ జరిగి నేటికి సరిగ్గా 19 ఏళ్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఈ ఎన్‌కౌంటర్‌లో సికాస నేత రమాకాంత్‌తో పాటు ఓ మహిళ, ముగ్గురు పోలీసులు మరణించారు.
కోల్‌బెల్ట్ ప్రాంతంలోని సీసీసీ పోలీసు స్టేషన్ పరిధిలో నస్పూర్‌కాలనీలో 1996 జూన్ 23న సింగరేణి కార్వర్టర్‌లో సికాసకు చెందిన ముఖ్య నాయకులు సమావేశమాయ్యరని సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిని చుట్టిముట్టి కాల్పులు ప్రారంభించారు. ఎదురు కాల్పుల్లో సీఐ చక్రపాణి, కానిస్టేబుళ్లు నక్సలైట్ల తూటాలకు బలి కావడంతో ప్రత్యేక పోలీసు బలగాలు మోహరింపజేశారు. సుమారు 12 గంటల పాటు జరిపిన ఈ కాల్పుల్లో కొనసాగాయి. తర్వాత పోలీసులు రమాకాంత్ ఉన్న ఇంటికి రంద్రం చేసి లోపల పెట్రోలు పోసి నిప్పంటించారు. జూన్ 24న రమాకాంత్ మంటల్లో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటన ఆధారంగా సినీ నటుడు ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో చీకటి సూర్యులు అనే చిత్రాన్ని తెరకెక్కించారు.