కరీంనగర్ : కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తిలో డీసీఎం వ్యాన్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని జిల్లాకు చెందినవారని పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.10 లక్షల రూపాయలు ఉంటుందని పోలీసులు చెప్పారు.