భద్రాచలం శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది.
భద్రాచలం: భద్రాచలం శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిలో శుక్రవారం ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. శ్రీ రామనవమి వేడుకలకు విజయవాడకు చెందిన యువకులు వచ్చారు. ఉదయం స్నానానికి వెళ్లినప్పుడు ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలిసింది. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారు విజయవాడలోని సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వల్లెపు రాము(18), గుంజా శివయ్య(18)గా గుర్తించారు.