తెలంగాణకు అదనంగా 200 మెడికల్ సీట్లు
తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 200 మెడికల్ సీట్లను ఎంసీఐ కేటాయించిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రాజయ్య తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు 600 నుంచి 800కి పెరిగాయని చెప్పారు. ఈ ఏడాది ఎంబీబీఎస్ ఫీజులు పెరిగేది లేదని స్పష్టం చేశారు.
ఆరోగ్యశ్రీని ప్రక్షాళన చేసి సమర్ధవంగా అమలుచేస్తామని, ఈ పథకం పరిధిలోకి మరిన్ని వైద్యసేవలను చేరుస్తామని రాజయ్య అన్నారు. ప్రభుత్వాస్పత్రులలో ఆరోగ్యశ్రీ చికిత్సలు ఎక్కువగా అందిస్తామని, ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తామని డిప్యూటీ సీఎం చెప్పారు.