30 ఏళ్ల క్రితం ఇక్కడే ఆడా | 30 years ago i will play here | Sakshi
Sakshi News home page

30 ఏళ్ల క్రితం ఇక్కడే ఆడా

Published Sun, Nov 9 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM

30 ఏళ్ల క్రితం ఇక్కడే ఆడా

30 ఏళ్ల క్రితం ఇక్కడే ఆడా

కోలాహలంగా స్టేడియం

రాష్ట్రంలో తొలిసారి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహిస్తుండడంతో జవహర్‌లాల్‌నెహ్రూ స్టేడియం క్రీడాకారులతో కోలాహలంగా మారిపోయింది. రెండురోజులపాటు జరగనున్న ఈ పోటీలకు పది జిల్లాల నుంచి దాదాపు 700మంది క్రీడాకారులు, మరో 300మంది టెక్నికల్, కోచ్‌లు హాజరయ్యారు. దీంతో స్టేడియం పరిసర ప్రాంతాలు కళకళలాడాయి. క్రీడాకారులు శుక్రవారం రాత్రే స్టేడియంకు చేరుకోవడంతో సందడి నెలకొంది.

హన్మకొండ చౌరస్తా : 30ఏళ్ల క్రితం ఇదే గ్రౌండ్‌లో ఆటలాడిన.. మళ్లీ ఇప్పుడు అధికార హోదాలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది.. అంటూ ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు, రిటైర్డ్ ఐఏఎస్ బీవీ పాపారావు తన కాలేజీ రోజులను గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ పోటీలు హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. క్రీడా పతాకాన్ని ఆవిష్కరించిన పాపారావు పది జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. తాను చదువుకున్న రోజుల్లో క్రీడాకారులకు ఎటువంటి సదుపాయాలు లేకున్నా జాతీయస్థాయికి ఎదిగిన క్రీడాకారులున్నారన్నారు.

తాను ఐఏఎస్ అయ్యాక అప్పటి ప్రధాని పీవీ నరసింహరావుతో కలిసి ప్రత్యేక విమానంలో హన్మకొండ వచ్చి స్టేడియం కోసం స్థలాన్ని పరిశీలించామని, ఆయన చలువతోనే ఈ స్టేడియం ఏర్పడిందన్నారు.  కేసీఆర్ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని, త్వరలోనే జేఎన్‌ఎస్‌లో అథ్లెటిక్స్ కోసం సింథటిక్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రబెల్లి వరద రాజేశ్వర్‌రావు, డీఎస్‌డీఓ సారయ్య, ప్రొఫెసర్ పాండురంగారావు, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సారంగపాణి పాల్గొన్నారు.
 
అండర్ 14 (బాలురు) : 600 మీటర్ల రన్నింగ్
డి.శ్రీకాంత్ (నల్గొండ), నిఖిల్‌కుమార్ (హైదరాబాద్), గణేష్ (వరంగల్)
అండర్ 14(బాలురు) : హైజంప్
ఆర్.ముని (నల్గొండ), జి.కన్నారావు (ఖమ్మం), ఇంద్రసేన (వరంగల్)
అండర్ -14(బాలురు) : షాట్‌పుట్ సత్యవన్(హైదరాబాద్), అవినాష్‌కుమార్‌సింగ్(రంగారెడ్డి), సురేష్(కరీంనగర్)
అండర్-16(బాలురు) : డిస్కస్ త్రో
సాహిల్ (హైదరాబాద్), ఎం.రవి (కరీంనగర్), రాహుల్ (వరంగల్)అండర్-16 (బాలురు) : లాంగ్‌జంప్
రమేష్ (వరంగల్), రజనీకుమార్ (వరంగల్), అజీబాబా (కరీంనగర్)
అండర్-18 (బాలురు) : డిస్కస్ త్రో
కిరణ్‌కుమార్ (ఖమ్మం), సాయికుమార్ (నిజామాబాద్), వెంకటేష్ (వరంగల్)
అండర్-20 (బాలుర) : 800 మీ. రన్నింగ్
చంద్రశేఖర్ (మహబూబ్‌నగర్), రాము (హైదరాబాద్), లోకేష్‌కుమార్ (రంగారెడ్డి)
అండర్-14 ( బాలికలు) : లాంగ్‌జంప్
దివ్యపావని (ఖమ్మం), లిఖిత (మహబూబ్‌నగర్), శైలజ (ఆదిలాబాద్)
అండర్-14 (బాలికలు) : షాట్‌పుట్
బి.సరిత (వరంగల్), శిరీష (నల్గొండ),
సునీత (మహబూబ్‌నగర్)
అండర్-16 (బాలికలు) : 200 మీటర్ల రన్నింగ్
నిత్య (హైదరాబాద్), భానుచంద్రిక (ఖమ్మం), మౌనిక (వరంగల్)
అండర్-18 (బాలికలు) : 500 మీటర్ల వాకింగ్
హర్షశ్రీ (రంగారెడ్డి), వాసవి (కరీంనగర్), భవానీ (కరీంనగర్)
అండర్-18(బాలికలు) :  జావెలిన్ త్రో
ఆర్.రాధిక (నిజామాబాద్),
వి.కవిత (ఆదిలాబాద్)
అండర్-18 (బాలికలు) : లాంగ్ జంప్
ఎస్.సుజాత (ఆదిలాబాద్), సీహెచ్.సమ్మక్క (ఖమ్మం), ఎన్.రోజా (నల్గొండ)
అండర్-20(బాలికలు) : 200 మీటర్ల రన్నింగ్
లేఖ(వరంగల్), హారికాదేవి(హైదరాబాద్), అశ్విని (వరంగల్)
అండర్-20(బాలికలు) : డిస్కస్ త్రో  
ఎం.అలివేలు (మహబూబ్‌నగర్), ఆష్మ (రంగారెడ్డి)
అండర్-20 (బాలికలు) : లాంగ్ జంప్
సవంతి (నిజామాబాద్), శాంతికుమారి (మహబూబ్‌నగర్), శోభ (నల్గొండ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement