సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 40 కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతమున్న మునిసిపాలిటీల్లో పదుల సంఖ్యలో శివారు గ్రామ పంచాయ తీలు విలీనం కానున్నాయి. పెరిగిన జనాభా, పన్నుల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. పలు మునిసిపాలిటీల గ్రేడ్లను పెంచబోతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వా త రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 31కి పెంచిన నేపథ్యంలో కొత్తగా జిల్లా కేంద్రాలుగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు మునిసిపా లిటీ హోదా కల్పించాల్సి ఉంది. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 20 వేలు, ఆపై జనాభా గల గ్రామ పంచాయతీలకు సైతం మునిసిపాలిటీ హోదా కల్పించాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని 15 గ్రామ పంచాయ తీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలు ఇప్పటికే రాష్ట్ర పుర పాలక శాఖకు చేరాయి. వీటితో పాటు మరో 12 మునిసిపాలిటీల్లో శివారు గ్రామ పంచాయ తీలను విలీనం చేయాలనే ప్రతిపాదనలపై పురపాలక శాఖ పరిశీలన జరుపుతోంది. నిబంధనలను అనుసరించి... 2011 జనాభా లెక్కల ప్రకారం 20 వేలు, ఆపై జనాభా కలిగి ఉండటంతో పాటు జనాభాలో దాదాపు సగం మంది వ్యవసాయేతర రంగంలో ఉపాధి పొందుతూ ఉంటేనే ఆ గ్రామ పంచాయతీని మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాలి. దీని ప్రకారం 40 గ్రామ పంచా యతీలకు మునిసిపాలిటీ హోదా ఇవ్వవచ్చని ప్రభుత్వ పరిశీలనలో తేలింది.
శివార్ల విలీనాలు.. హోదాల పెంపు!
నల్లగొండ మునిసిపాలిటీ హోదాను ఫస్ట్ గ్రేడ్ నుంచి స్పెషల్ గ్రేడ్‌కు పెంచుతూ త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అదే విధం గా కొత్తగా జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాగర్ కర్నూల్‌కు నగర పంచాయతీ నుంచి మునిసి పాలిటీగా, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి గ్రామ పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా హోదా పెంచనుంది. సంగారెడ్డి మునిసిపాలిటీలో 11 శివారు గ్రామ పంచాయతీల విలీనం ప్రతిపాద నలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. బోధన్ (నిజామాబాద్) మునిసిపాలిటీలో శివారు ప్రాంతాల విలీనం, తాండూరు(వికారాబాద్) మునిసిపా లిటీ పరిధి పెంపు, ఆందోల్– జోగిపేట్ నగర పంచాయతీలో ఆరు శివారు గ్రామాలు, సదాశివపేట మునిసిపాలిటీలో 13 శివారు గ్రామాలు, జహీరాబాద్ మునిసిపాలిటీలో 15 శివారు గ్రామాల విలీనం ప్రతిపాదనలు ఉన్నాయి. షాద్‌నగర్ మునిసి పాలిటీ హోదాను గ్రేడ్–2గా పెంచనుంది.
కొత్త ప్రతిపాదనలు..
బాన్సువాడ(కామారెడ్డి జిల్లా), చేర్యాల(సిద్దిపేట), తొర్రూరు(రంగారెడ్డి), నర్సాపూర్ (మెదక్), మరిపెడ(మహబూబాబాద్), నారాయణ్ ఖేడ్(సంగారెడ్డి), రామాయంపేట (మెదక్), బొల్లారం(సం గారెడ్డి), నిజాంపేట(రంగారెడ్డి), ఆసిఫాబాద్ (కుమ్రం భీం ఆసిఫాబాద్), డోర్నకల్ (మహబూబాబాద్), మద్దూరు (మహబూబ్‌నగర్), కోస్గి (మహబూబ్‌నగర్), ధర్మపురి (జగిత్యాల), తూఫ్రాన్(మెదక్) గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనలను రాష్ట్ర పురపాలక శాఖ పరిశీలిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment