హోరుగాలికి కుప్పకూలిన 400 ఏళ్ల మర్రిచెట్టు | 400 year old banyan tree fell down in shahbad | Sakshi
Sakshi News home page

హోరుగాలికి కుప్పకూలిన 400 ఏళ్ల మర్రిచెట్టు

Published Sat, Apr 8 2017 1:03 AM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM

హోరుగాలికి కుప్పకూలిన 400 ఏళ్ల మర్రిచెట్టు

హోరుగాలికి కుప్పకూలిన 400 ఏళ్ల మర్రిచెట్టు

చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలం మన్‌మర్రి గ్రామంలోని 400 ఏళ్లనాటి మర్రిచెట్టు శుక్రవారం సాయంత్రం పెనుగాలుల ఉధృతికి కుప్పకూలింది. గ్రామానికి అప్పట్లో ఈ మర్రి చెట్టు కారణంగానే మన్‌మర్రి అని పేరు వచ్చినట్లు స్థానికులు చెప్పారు. గ్రామం నడిమధ్యలో ఎత్తుగా ఉండి ఊడలమర్రిని తలపించేది. పచ్చదనంతో ఎప్పుడూ ఆహ్లాదకర వాతావరణాన్ని కలిగించే ఈ చెట్టు ఒక్కసారిగా వీచిన పెనుగాలికి వేర్లతో సహా పడిపోయింది. దీంతో మర్రిచెట్టు కింద పార్క్‌ చేసిన రెండు బైకులు దెబ్బతిన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement