స్వల్ప గొడవలు మినహా ప్రశాంతం
► 44, 47 డివిజన్లలో
► డబ్బులు పంచుతున్నారని గొడవ
► 36వ డివిజన్‌లో పోలీసుల లాఠీచార్జి
హన్మకొండ : గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో చెదురు, ముదురు సంఘటనలు మినహా మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం గా మూడు డివిజన్లలో గొడవలు జరిగాయి. రెండు డివిజన్లలో అధికార పక్షానికి చెందిన వారు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని విపక్షాలకు చెందిన నాయకులు తిరగబ డ్డారు. మరో డివిజన్‌లో ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్లపై ఓ ఎస్సై లాఠీ ఝులిపిం చాడు. మిగతా అన్ని డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. అయితే, పోలింగ్ మందకొడిగా సాగడం గమనార్హం. 44 డివి జన్‌లో అధికార పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు డబ్బులు పంచుతున్నాని పరస్పర దాడులు చేసుకున్నారు.
ఈ క్రమంలో బీజేపీకి మద్దతు ఇస్తున్న స్వతంత్య్ర అభ్యర్థి కుందారపు శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని వదిలేశారు. 47వ డివిజన్‌లో గోకుల్‌నగర్ పోచమ్మ దేవాలయం వద్ద టీఆర్‌ఎస్ నాయకులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఆ పార్టీలో ఇటీవల చేరిన ఈ.వీ.సతీష్ ఇంటిపై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. కుర్చీలు విరగ్గొట్టారు. దీంతో టీఆర్‌ఎస్ నాయకులు ఆ ఇం ట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుండ గా స్థానికేతరులు వచ్చి ఓటర్లను ప్రభావి తం చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నా యకులు మరోసారి అభ్యంతరం చేశారు.
ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో సుబేదారి సీఐ నరేందర్, కేయూ పోలీసుస్టేషన్ సీఐ ఎస్‌ఎం.అలీ పోలీసు బలగాలతో చేరుకుని స్థానికేతరులను చెరగొట్టారు. ఈక్రమంలో హన్మకొండ ఏసీపీ శోభన్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు ఎసీపీ శోభన్‌కుమార్, సీఐ నరేందర్ 47వ డివిజన్‌లోనే మకాం వేసి పోలింగ్ ప్రశాంతగా ముగిసేలా చర్యలు తీసుకున్నారు. మిగతా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
సహాయక కేంద్రం వద్ద..
కాజీపేట / కాజీపేట రూరల్ : కాజీపేట 36వ డివిజన్‌లోని రైల్వే మిక్స్‌డ్ హైస్కూల్‌లో పోలింగ్ కేంద్రం ఏర్పాటుచేశారు. ఈ డివిజన్‌లో పరిధిలోని రైల్వే క్వార్టర్‌సకు చెందిన ఓటర్లు ఎక్కువ మందికి పోల్ చీటీలు అందలేదు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన సహాయక కేంద్రం వద్ద పలువురు తమ ఓటరు సీరియల్ నంబర్ తదితర వివరాలు చూసుకుంటున్నారు.
ఇంతలో అక్కడ విధుల్లో ఉన్న ధర్మసాగర్ ఎస్సై రాఘవేందర్ విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో నీరటి పుష్ప, ప్రభాకర్, విజయ్‌తో పాటు పలువురికి గాయాలయ్యాయి. పోలీసుల తీరును నిరసిస్తూ వివిధ పార్టీల నాయకులు ధర్నాకు దిగారు. అయితే, ఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, శాఖపరమైన విచారణ జరిపిస్తానని కాజీపేట ఏసీపీ జనార్దన్ చెప్పడంతో ఆందోళన విరమించారు. కాగా, పోలీసుల లాఠీచార్‌జ ఘటనను రైల్వే జేఏసీ నాయకులు రైల్వే జేఏసీ నాయకులు దేవులపల్లి రాఘవేందర్, ఎస్‌కే.జానీ, సీహెచ్.తిరుపతి, ఎ.శ్రీనివాస్, పి.సురేష్, పాషా ఖండించారు.