కల్తీలేని ‘పాలమూరు’ను నిర్మిస్తాం | Absoluted palamuru build | Sakshi
Sakshi News home page

కల్తీలేని ‘పాలమూరు’ను నిర్మిస్తాం

Published Sun, Mar 13 2016 2:39 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

కల్తీలేని ‘పాలమూరు’ను నిర్మిస్తాం - Sakshi

కల్తీలేని ‘పాలమూరు’ను నిర్మిస్తాం

వినియోగదారులను చైతన్య పరుస్తాం
వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు

 
మహబూబ్‌నగర్ కల్చరల్ : వస్తువుల విక్రయాలు, బిల్లింగ్‌లలో జరుగుతున్న అవినీతిని అరికట్టి కల్తీలేని పాలమూరు జిల్లాగా తీర్చిదిద్దుతామని వినియోగదారుల హక్కుల సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు గూడూర్ జైపాల్‌రెడ్డి ఉద్ఘాటించారు. శనివారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో సంస్థ జిల్లా అధ్యక్షుడు జెట్టి రాజశేఖర్ అధ్యక్షతన జిల్లా కార్యవర్గం ఎన్నిక జరిగింది. కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. వినియోగదారులను చైతన్య పరుస్తూ, అన్ని రంగాల్లో కల్తీలేకుండా వారికి  సేవలు అందించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. ఎంఆర్‌పీ రేట్లకే వస్తువులను విక్రయించాలని, వినియోగదారుడు కచ్చితంగా బిల్లు తీసుకోవాలని సూచించారు.

అనంతరం నూతన కార్యవర్గానికి ఆయన నియామకపత్రాలు అందజేశారు. సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.శ్రీధర్, ఉపాధ్యక్షులుగా అశోక్ చక్రవర్తిగౌడ్, ఓం ప్రకాశ్, కోశాధికారిగా చంద్రశేఖర్, జిల్లా గౌరవ సలహాదారుడిగా రఘురాంరెడ్డి, లీగల్ అడ్వయిజర్‌గా చెన్నయ్యగౌడ్, మహబూబ్‌నగర్ పట్టణ అధ్యక్షుడిగా విజయ్‌కుమార్, జిల్లా కార్యదర్శులుగా లక్ష్మినారాయణ, నరసింహయ్య, రామకృష్ణ, ఇబ్రహీం, శ్రీకాంత్‌రెడ్డి, మాధవరెడ్డి, ఫెర్రిరాయ్, సంయుక్త కార్యదర్శులుగా పదిమందిని ఎన్నుకున్నారు. సమావేశంలో సంస్థ జాతీయ కార్పొరేట్ ఇన్‌చార్జి సందీప్ బన్సల్, రాష్ట్ర కార్పొరేట్ ఇన్‌చార్జి మహేందర్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement