కల్లూరు : ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన రెవెన్యూ అధికారిణి వసంతబాయి లంచం తీసుకుంటూ మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని కప్పలబందం గ్రామానికి చెందిన రైతు జాస్తి వెంకటేశ్వరరావు అడంగల్ పహాణీ కాపీ కోసం దరఖాస్తు చేయగా... రెవెన్యూ అధికారిణి వసంతబాయి లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. వలపన్నిన ఏసీబీ అధికారులు మంగళవారం రైతు నుంచి రూ.5వేలు లంచం తీసుకుంటుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు.