కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సివిల్ ఆస్పత్రి సీనియర్ అసిస్టెంట్ అహ్మదాబేగం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
పెద్దపల్లి : కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సివిల్ ఆస్పత్రి సీనియర్ అసిస్టెంట్ అహ్మదాబేగం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాల్వ శ్రీరామ్‌పూర్ మండలం పెగడపల్లి ఏఎన్‌ఎం విజయ టీఏ,డీఏల బకాయిల విడుదల కోసం అహ్మద్‌బేగంను సంప్రదించగా రూ.10వేలు లంచం డిమాండ్ చేశారు.
రూ.5 వేలకు ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఏఎన్‌ఎం విజయ ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చారు. శుక్రవారం పెద్దపల్లి ఆస్పత్రిలో ఏఎన్‌ఎం నుంచి సీనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటుండగా ఖమ్మం డీఎస్సీ సాయిబాబ సిబ్బందితో కలసి అదుపులోకి తీసుకున్నారు.