రాజుపేట (నల్గొండ జిల్లా) : రాజుపేట మండలం నమిల గ్రామ వీఆర్‌ఓ శేషగిరిరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు మంగళవారం పట్టుబడ్డాడు. రాపోలు రవీందర్ రెడ్డి అనే రైతు నుంచి రూ.7 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. రవీందర్ రెడ్డి తనకున్న ఏడెకరాలను భూమిని పౌతీ చేయించడానికి వెళితే వీఆర్ఓ లంచం డిమాండ్ చేశాడు. ఈ విషయం రైతు రవీందర్ రెడ్డి ఏసీబీ అధికారులకు తెలియజేశాడు. పథకం ప్రకారం రైతు నుంచి లంచం తీసుకుంటుండగా వీఆర్‌ఓను రెవెన్యూ ఆఫీసులో అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.