సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న తిరుపతిరెడ్డి రూ.17 వేలు లంచం తీసుకుంటుండగా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇక గురువారం జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో.. ఉత్తమ సేవలకు గాను ఇచ్చే ప్రశంసా పత్రాన్ని తిరుపతిరెడ్డి అందుకోవడం గమనార్హం. ఏసీబీ అధికారి.. కృష్ణ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం..
మహబూబ్ నగర్ మండలం వెంకటాపూర్ చెందిన రమేష్ అనే ఇసుక వ్యాపారి దగ్గర రెండు సంవత్సరాల నుంచి కానిస్టేబుల్ తిరుపతిరెడ్డి లంచాలు తీసుకుంటున్నాడు. ఈ నెల 3వ తేదీన తనకు ఇసుక రవాణాకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఉన్నప్పటికీ లంచంగా రూ.17 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్ పరిధిలో తిరుపతి రెడ్డి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment