జడ్చర్ల (మహబూబ్‌నగర్) : వంట సరుకుల బిల్లుల మంజూరుకు అంగన్‌వాడీ కార్యకర్త నుంచి లంచం తీసుకున్న సూపర్‌వైజర్‌ను ఏసీబీ అధికారులు గురువారం జడ్చర్ల ఐసీడీఎస్ కార్యాలయంలో రెడ్‌హ్యాండ్‌గా పట్టుకున్నారు. బాలానగర్ మండలం రాజాపూర్ సెక్టార్‌లోని దొండ్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని కొర్రతండాకు చెందిన అంగన్ వాడీ కార్యకర్త నాగమణి తమ కేంద్రానికి సంబంధించిన వంట సరుకుల బిల్లులు మంజూరు చేయాలని కోరింది. దీనికి అంగన్‌వాడీ సూపర్‌వైజర్ శశికళ రూ. 2వేల లంచం అడిగారు. నాలుగు నెలలుగా లంచం ఇవ్వాలని వేధించారు. దీంతో బాధితురాలు నాగమణి ఏసీబీ అధికారులను ఆశ్రయించింది.
వలపన్నిన ఏసీబీ అధికారులు గురువారం జడ్చర్ల ఐసీడీఎస్ కార్యాలయంలో అంగన్‌వాడీ కార్యకర్త నాగమణి నుంచి సూపర్‌వైజర్ శశికళ రెండు వేల రూపాయలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. సూపర్‌వైజర్‌ను అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.ఈ దాడులలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు గోవింద్‌రెడ్డి,రమేశ్‌రెడ్డి,ఏఓ హేమలత,స్వప్నలు పాల్గొన్నట్లు తెలిపారు.
ఏసీబీ వలలో అంగన్‌వాడీ సూపర్‌వైజర్
Published Thu, Apr 30 2015 5:38 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement